ఘనంగా ప్రారంభమైన శ్రీ శ్రీ శ్రీ పోలేరమ్మజాతర మహోత్సవం
తిరుపతి(వెంకటగిరి): శక్తి స్వరూపిణి శ్రీ శ్రీ శ్రీ పోలేరమ్మ జాతర సందర్బంగా అమ్మవారికి ప్రభుత్వ లాంఛనాలతో దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి గురువారం ఉదయం వెంకటగిరిలో పట్టు వస్త్రాలను సమర్పించారు.
ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ వెంకటగిరి నందు కొలువైనా శక్తి స్వరూపిణి శ్రీ శ్రీ శ్రీ పోలేరమ్మ జాతర ప్రభుత్వ లాంఛనాలతో రాష్ట్ర పండుగగా నిర్వహించడం చాలా సంతోషంగా ఉందన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటయిన తరువాత రెండవ సారి ఇక్కడ భక్తులు అమ్మవారి జాతర జరుపుకుంటున్నామన్నారు. ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండాలని, రాష్ట్రం ఉండాలని అమ్మవారిని కోరుకున్నానన్నారు.
రాష్ట్ర పండుగగా 11 ఆలయాలు:- గతంలో 5 ఆలయాల్లో మాత్రమే వాతావరణం ఉండేదని, కూటమి ప్రభుతం ఏర్పాటు అయ్యాక ముఖ్యమంత్రి చంద్రబాబు 11 ఆలయాలకు పెంచి, ప్రతి ఆలయానికి 50 లక్షల రూపాయల వరకు ఆర్థిక సహాయం ప్రభుత్వం ద్వారా అందిస్తున్నామన్నారు. ఈ సంవత్సరం అమ్మవారి జాతరకు 40 లక్షల రూపాయలు దేవాదాయ శాఖ నుండి విడుదల చేసిందని, ప్రభుత్వం డబ్బు ఎంత ఖర్చు పెట్టినా సామాన్య భక్తులకు అమ్మవారి దర్శనం ముఖ్యమని భావిస్తోందన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్,,జిల్లా ఎస్.పి హర్షవర్ధన్ రాజు, గూడూరు సబ్ కలెక్టర్ రాఘవేంద్ర మీనా,ఎంఎల్ఏ కురుగొండ్ల రామకృష్ణ, దేవాదాయ శాఖ అధికారులు, ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.