NATIONAL

భారత-మారిషస్‌లు దేశాలే కాని ఒక కుటుంబం లాంటివి-ప్రధాని మోదీ

అమరావతి: స్థానిక కరెన్సీలలో ద్వైపాక్షిక వాణిజ్యాన్ని ప్రారంభించడానికి భారతదేశం-మారిషస్‌లు కృషి చేస్తాయని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్నారు. గురువారం ఉత్తర్‌ప్రదేశ్‌లోని వారణాసిలో మారిషస్ ప్రధాన మంత్రి నవీన్‌చంద్ర రామ్‌గులంతో విస్తృత చర్చలు జరిపారు.. ఈ సమావేశంలో పలు కీలక రంగాల్లో ఇరుదేశాల మధ్య ఒప్పందాలు జరిగాయి..అనంతరం ప్రధాని మోదీ మాట్లాడుతూ స్వేచ్ఛాయుత, బహిరంగ, సురక్షితమైన, స్థిరమైన, సంపన్నమైన హిందూ మహాసముద్రం భారత్, మారిషస్ రెండింటికీ ఉమ్మడి ప్రాధాన్యమని పేర్కొన్నారు.భారత్‌, మారిషస్‌ రెండు దేశాలే కానీ,,వాటి కలలు, గమ్యాలు ఒకటేనని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఇరు దేశాలు కేవలం భాగస్వామ్యలు మాత్రమే కాదని ఒక కుటుంబమని వ్యాఖ్యానించారు.. అనంతరం మాట్లాడిన ప్రధాని మోదీ, మారిషస్ ప్రత్యేక ఆర్థిక మండలి భద్రత, సముద్ర సామర్థ్యాన్ని బలోపేతం చేయడానికి భారత్‌ కట్టుబడి ఉందని తెలిపారు. స్థానిక కరెన్సీలో వాణిజ్యం చేసేందుకు ఇరుదేశాలు నిర్ణయించాయని చెప్పారు. స్వేచ్ఛాయుత, బహిరంగ, సురక్షితమైన, స్థిరమైన, సంపన్నమైన హిందూ మహాసముద్రం భారత్, మారిషస్ రెండింటికీ ఉమ్మడి ప్రాధాన్యమని మోదీ పేర్కొన్నారు. ప్రస్తుతం 7 రోజుల భారత పర్యటనలో ఉన్న మారిషష్ ప్రధాని రామ్‌గులాం సెప్టెంబర్ 16 వరకు మన దేశంలో ఉంటారు. తన పదవీకాలంలో భారత్​కు ఆయన రావడం ఇదే తొలిసారి.. త్వరలో ప్రముఖ పుణ్యక్షేత్రాలు అయోధ్య,, తిరుపతిని సందర్శించనున్నారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *