భారత్-అమెరికా మధ్య ప్రత్యేక బంధం ఉంది-ట్రంప్
తత్వం భొధపడుతొంది..
అమరావతి: ప్రపంచ దేశాలను బెదిరించి అమెరికా ముందు మెకారిల్లేలా చేసేందుకు అమెరికా 47వ అధ్యక్షడు అయిన డొనాల్డ్ ట్రంప్ పప్పులు భారతదేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ముందు ఉడకలేదు..టారిఫ్ లతో భారతదేశంను లొంగ తీసుకొవాలని అన్ని రకాలుగా ప్రయత్నించిన ట్రంప్ కు,,ఇప్పుడిప్పుడే తత్వం భొధపడుతొంది..భారత్,,చైనా,,రష్యాలు దగ్గర అయితే అమెరికాతో పాటు యూరొప్ దేశాల ఆర్దిక వ్యవస్థలు కుప్పకూలిపోతాయి అనే విషయం “ఆర్దం అయ్యింది” అనిపిస్తొంది..ఈ నేపధ్యంలో శుక్రవారం మీడియా అడిగిన ప్రశ్నకు ట్రంప్ సమాధానం ఇస్తూ,భారత్-అమెరికా మధ్య ప్రత్యేక బంధం ఉందని,, ప్రధాని మోదీతో స్నేహంగా ఉంటానని వ్యాఖ్యనించారు..అంతేకాదు మోదీ గొప్ప ప్రధాని అంటూ కితాబిచ్చారు.. ట్రంప్ వ్యాఖ్యలపై ప్రధాని మోదీ తాజాగా స్పందించారు.. ట్రంప్ సానుకూల వైఖరి అభినందనీయమంటూ ట్వీట్టర్ లో వ్యాఖ్యనించారు..భారత్, అమెరికాలు మంచి భవిష్యత్తు, వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని కలిగి ఉన్నాయని వెల్లడించారు.
(48 గంటల ముందు భారత్-అమెరికా బంధంపై ట్రంప్ ట్రూత్‌లో ఓ పోస్ట్ పెట్టారు.. టియాంజిన్‌లో జరిగిన షాంఘై సహకార సంస్థ(ఎస్‌సీఓ) శిఖరాగ్ర సదస్సులో మోదీ, జిన్‌పింగ్, పుతిన్ కలసి తీసుకున్న ఫొటోను ట్రంప్ షేర్ చేస్తూ..అమెరికా… భారత్, రష్యాను చైనాకు వదులుకుంటున్నట్లు అనిపిస్తొందని వ్యాఖ్యానించారు.. ఆ మూడు దేశాల భవిష్యత్తు సుసంపన్నం కావాలంటూ ఆయన వ్యంగ్యంగా శుభాకాంక్షలు తెలియచేశారు.)