వినాయక నిమజ్జనం నాడు కోటి మందిని చంపేస్తామంటూ బెదిరింపు మేసెజ్
అమరావతి: వినాయక నిమజ్జనం నాడు కోటి మందిని చంపేస్తామంటూ ముంబై ట్రాఫిక్ పోలీసు వాట్సప్ హెల్ప్ లైన్ నంబర్‌కు ఈ బెదిరింపు సందేశం వచ్చింది. నగరం మొత్తం దద్ధరిల్లేలా 34 వాహనాల్లో 400 కిలోల RDX పేలుడు పదార్థాలను సిద్ధం చేసినట్లు ఈ సందేశం వచ్చింది..ఈ ఉగ్ర బెదిరింపులతో ముంబై పోలీసులు హై అలర్ట్ అయ్యారు. రాష్ట్రవ్యాప్తంగా భద్రతను పెంచినట్లు ముంబై పోలీసులు తెలిపారు.ఈ-మెయిల్ ‘లష్కర్-ఏ-జిహాదీ’ అనే వాట్సాప్ ఖాతా నుంచి వచ్చినట్లు గుర్తించారు.ఈ బెదిరింపును అన్ని కోణాల నుండి దర్యాప్తు చేస్తున్నామని, ఉగ్రవాద నిరోధక దళం (ATS)కి సమాచారం అందించామని అధికారి తెలిపారు.