ప్రతి కుటుంబానికి ఏడాదికి రూ.25 లక్షల వరకు ఉచిత వైద్య చికిత్స-మంత్రివర్గం
అమరావతి: రాష్ట్ర ప్రజలకు మెరుగైన ఆరోగ్య సేవలు అందించే దిశగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన గురువారం జరిగిన సమావేశంలో యూనివర్సల్ హెల్త్ పాలసీకి కేబినెట్ ఆమోదించిందని మంత్రి పార్థసారథి మీడియా సమావేశ:లో వెల్లడించారు.. ఆయుష్మాన్ భారత్-ఎన్టీఆర్ వైద్య సేవా పథకం కింద ఈ పాలసీని అమలు చేయనున్నారు.. ఈ పాలసీతో రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి ఏడాదికి రూ.25 లక్షల వరకు ఉచిత వైద్య చికిత్స అందిస్తారు.. ఆర్థిక స్థితిగతులతో సంబంధం లేకుండా రాష్ట్రంలోని అన్ని వర్గాల వారికి హెల్త్ పాలసీ వర్తించేలా చర్యలు తీసుకొనున్నారు.. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 1.63 కోట్ల కుటుంబాలకు ఈ హెల్త్ పాలసీ వర్తించనుంది..
6 గంటల్లోనే అనుమతులు:- రాష్ట్ర వ్యాప్తంగా 2,493 నెట్‌వర్క్ ఆసుపత్రుల్లో హైబ్రిడ్ విధానం ద్వారా ప్రభుత్వం ఉచిత వైద్యసేవలు అందిస్తుంది.. ఈ విధానం కిందే మొత్తం 3,257 చికిత్సలను పూర్తి ఉచితంగా అందిస్తారు.. ప్రీ-ఆథరైజేషన్ మేనేజ్‌మెంట్ ద్వారా కేవలం 6 గంటల్లోనే అనుమతులు మంజూరు చేసే విధానం అమల్లోకి రానుంది.. రూ.2.5 లక్షల లోపు ఖర్చులను ఇన్సూరెన్స్ కంపెనీలు భరించనున్నట్లు తెలుస్తొంది..ఎన్టీఆర్ వైద్యసేవ ట్రస్ట్ రూ.2.5 లక్షల నుంచి రూ.25 లక్షల వరకూ వైద్య ఖర్చులు భరించనుంది..ఈ కొత్త పాలసీ ద్వారా 1.43 కోట్ల పేద కుటుంబాలు, 20 లక్షల ఇతర కుటుంబాలకు వర్తించనుంది.
10 కొత్త మెడికల్ కాలేజీల ఏర్పాటు:- పీపీపీ (పబ్లిక్ ప్రైవేట్ పార్ట్ నర్‌షిప్) విధానంలో రాష్ట్రంలో 10 కొత్త మెడికల్ కాలేజీల ఏర్పాటుకు ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది..రెండు దశల్లో ఆదోని, మదనపల్లె, మార్కాపురం, పులివెందుల, పెనుగొండ, పాలకొల్లు, అమలాపురం, నర్సీపట్నం, బాపట్ల, పార్వతీపురంలో పిపిపి పద్దతిలో వైద్య కళాశాలలు ఏర్పాటు చేయనున్నారు.. ఈ మేరకు ఆర్ఎఫ్పీ జారీ చేసేందుకు రాష్ట్ర మంత్రివర్గం అనుమతి తెలిపింది..రెండో దశలో మిగిలిన 6 జిల్లాల్లో వైద్య కళాశాలలను పీపీపీ కింద ఏర్పాటు చేసేందుకు ఫీజిబిలిటీ రిపోర్టు సిద్ధం చేయాలని నిర్ణయించారు.
సీబీఐ డైరెక్టర్ కు లేఖ:- సుగాలీ ప్రీతి కేసులో సీబీఐ విచారణ జరపాలని,,ఈ విషయమై సీబీఐ డైరెక్టర్ కు లేఖ రాయాలని సీఎం అధికారును ఆదేశించారు.. సోషల్ మీడియా అడ్మిన్ బాధ్యతాయుతంగా ఉండేలా చూడాలని సూచించారు.. కుప్పం కాలువలోకి నీళ్లు రావడం లేదంటూ సోషల్ మీడియాలో వస్తున్న అసత్య ప్రచారాలకు అడ్డుకట్ట వేయాలని సూచించారు.