పూర్తిగా స్వదేశీ టెక్నాలజీతో తయారైన తొలి సెమీకండక్టర్ చిప్ విక్రమ్-32 అందుకున్న ప్రధాని మోదీ
దేశంలో 10 సెమీకండక్టర్ ప్రాజెక్టులు..
అమరావతి: కేంద్ర ఐటీ మంత్రి అశ్విని వైష్ణవ్ భారతదేశంలో తయారు చేసిన తొలి(సెమీ కండక్టర్) చిప్‌ను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి అందజేశారు..సెమీకండక్టర్ రంగంలో భారత్ కొత్త మైలురాయిని అధికమించింది.. మంగళవారం ఢిల్లీలో జరిగిన సెమికాన్ ఇండియా 2025 సదస్సులో విక్రమ్-32 బిట్ మైక్రోప్రాసెసర్ చిప్‌ను ప్రదర్శించారు.. పూర్తిగా స్వదేశీ టెక్నాలజీతో తయారైన మొదటి సెమీకండక్టర్ చిప్ విక్రమ్-32.. సెమీకండక్టర్ రంగంలో భారత్ సాధించిన అతి పెద్ద విజయం.. ఇస్రో, చండీగఢ్‌లోని సెమీకండక్టర్ లేబోరేటరీ సంయుక్తంగా అభివృద్ధి చేసిన ఈ చిప్ ను రాకెట్ ప్రయోగాలకు ఉపయోగిస్తారు.
18 బిలియన్ డాలర్ల పెట్టుబడి:- మంత్రి ఆశ్వనీ వైష్ణవ్ విక్రమ్ 32-బిట్ ప్రాసెసర్ తో పాటు నాలుగు ఆమోదించిన ప్రాజెక్టుల టెస్ట్ చిప్‌లను కూడా ప్రధాని మోదీకి అందించారు..ఆరోగ్య సంరక్షణ, రవాణా, కమ్యూనికేషన్, రక్షణ, అంతరిక్షం వంటి ముఖ్యమైన వ్యవస్థలలో ఇది ఉపయోగించడం జరుగుతుంది..ప్రపంచం మొత్తం డిజిటల్, ఆటోమేషన్ వైపు కదులుతున్నందున, ఆర్థిక భద్రత, వ్యూహాత్మక స్వాతంత్ర్యం కోసం సెమీకండక్టర్లు అవసరం అయ్యాయి..భారతదేశం కూడా ఈ దిశలో వేగంగా కదులుతోంది… 2021 నుండి దేశంలో 10 సెమీకండక్టర్ ప్రాజెక్టులకు ఆమోదం లభించింది..ఈ సందర్బంలో ప్రధాని మోదీ మాట్లాడుతూ ఈ ప్రాజెక్టుల కోసం 18 బిలియన్ డాలర్ల పెట్టుబడి పెడుతున్నామని తెలిపారు..
భారతదేశ GDP 7.8 శాతం వృద్ధి రేటును:- ఈ ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో “ఆర్థిక స్వార్థ ప్రయోజనాల వల్ల కలిగే సవాళ్లు” ఉన్నప్పటికీ భారతదేశ GDP 7.8 శాతం వృద్ధి రేటును సాధించిందని ప్రధాని మోదీ అన్నారు.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారతీయ వస్తువులపై విధించిన సుంకాలను ఆయన విమర్శించారు.. భారత ఆర్థిక వ్యవస్థ ప్రతి అంచనాను అధిగమించిందని అన్నారు..ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక వ్యవస్థలు వారి స్వాలభం కోసం నడిచే ఆందోళనలు,, సవాళ్లను ఎదుర్కొంటున్నప్పటికీ భారతదేశం 7.8 శాతం వృద్ధి రేటును సాధించిందని అని ప్రధాని పేర్కొన్నారు.. భారతదేశ స్థూల దేశీయోత్పత్తి 6.5 శాతం అంచనాతో పోలిస్తే 7.8 శాతం పెరిగిందని,, గత సంవత్సరం ఇదే సమయంలో కంటే ఈ సంఖ్య 1.3 శాతం పాయింట్లు ఎక్కువ అన్నారు..
ఇండియా ఇజ్ డెడ్ ఎకానమీ:- తయారీ, సేవలు, వ్యవసాయం, నిర్మాణం వంటి అన్ని రంగాలలో ఈ వృద్ధి కనిపిస్తుంది అని ప్రధాని మోదీ అన్నారు. భారత్‌పై ట్రంప్ చేస్తున్న (ఇండియా ఇజ్ డెడ్ ఎకానమీ) “చనిపోయిన ఆర్థిక వ్యవస్థ” అనే విమర్శను ధీటుగా బదులు ఇస్తూ మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా వేగంగా అభివృద్ధి చెందడానికి ముందుకు నడిపిస్తోందని ఆయన అన్నారు.