తిరుపతిలో రాష్ట్రస్థాయి అమరావతి ఛాంపియన్షిప్ పోటీలు
తిరుపతి: తిరుపతిలో జరుగుతున్న రాష్ట్రస్థాయి అమరావతి ఛాంపియన్ షిప్ పోటీలను జిల్లా కలెక్టర్ డా ఎస్ వెంకటేశ్వర్ సందర్శించారు..సోమవారం రాష్ట్రస్థాయి అమరావతి ఛాంపియన్షిప్ కార్యక్రమంలో భాగంగా స్థానిక ఎస్వీ యూనివర్సిటీ, ఎస్ వి క్యాంపస్ స్కూల్, ఆర్ట్స్ కాలేజీలలో జరుగుతున్న పలు క్రీడలను సందర్శించి క్రీడాకారులను అభినందించారు. జిల్లా కలెక్టర్ క్రీడాకారులతో కలిసి ఉత్సాహంగా త్రోబాల్, ఆర్చరీ, బాక్సింగ్ క్రీడాకాలతో కలిసి ఆడారు.
క్రీడాకారులు,క్రీడా స్పూర్తి కొనసాగించి రాష్ట్రానికి, జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని, మరిన్ని పథకాలు సాధించాలని క్రీడాకారులకు అకాంక్షించారు..అనంతరం ప్రతిభ కనబరచిన క్రీడాకారులకు ప్రశంసా పత్రాలు అందజేశారు.. ఈ కార్యక్రమంలో టీటీడీ బోర్డు మెంబర్ పనబాక లక్ష్మి, శాప్ చైర్మన్ రవి నాయుడు, యాదవ కార్పొరేషన్ చైర్మన్ నరసింహ యాదవ్, స్పోర్ట్స్ అథారిటీ డైరెక్టర్, క్రీడాకారిణి రజిని, మీడియా కోఆర్డినేటర్ శ్రీధర్ వర్మ, డిఎస్ సి ఓ శశిధర్ , క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు.