AP&TG

అటవీ శాఖ ఉద్యోగులై ఎమ్మేల్యే దాడి-కూటమి ప్రభుత్వం ఉపేక్షించదు-పవన్ కళ్యాణ్

అమరావతి: శ్రీశైలం అటవీ ప్రాంతంలో విధి నిర్వహణలో ఉన్న అటవీ శాఖ ఉద్యోగులతో ఘర్షణకు దిగి, దాడికి పాల్పడ్డ ఘటన గురించి శాఖ ఉన్నతాధికారులు వివరించారని ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.. ఈ ఘటనల్లో శాసనసభ్యులు, ఆయన అనుచరుల ప్రమేయంపై విచారించి సవివరంగా నివేదిక ఇవ్వాలని ఆదేశించాను. బాధ్యులపై నిబంధనల ప్రకారం కేసులు నమోదు చేయాలని స్పష్టంగా చెప్పాను. చట్టాలను అతిక్రమించి క్రిమినల్ చర్యలకు పాల్పడి ఏ స్థాయిలో ఉన్నవారినైనా ఉపేక్షించకూడదని, ఇందుకు ప్రధానమంత్రి అయినా, ముఖ్యమంత్రి అయినా ఒకటే అని, అరెస్టయిన 31వ రోజు పదవి కోల్పోయే చట్టం తీసుకురాబోతోంది గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం.. ‘మేము తప్పు చేసినా బాధ్యులను చేయమని రాష్ట్రం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, నేను కూడా శాసన సభలో స్పష్టంగా చెప్పాము. నిబద్ధతతో, నియంత్రణతో విధులు నిర్వర్తిస్తున్నాము. కాబట్టి ప్రజా జీవితంలో ఉన్నవారు ముందుగా తమను తాము నియంత్రించుకోవాలి.. ఉద్యోగుల విధి నిర్వహణకు ఆటంకం కలిగించేవారు ఏ స్థాయిలో ఉన్నా ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ఉపేక్షించదని స్పష్టం చేశారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *