AP&TG

రాజధాని అమరావతిపై అనుచిత వ్యాఖ్యలు-పవన్ కళ్యాణ్

(అమరావతి రాజధాని.. దేవతలు రాజధాని కాదు, వేశ్యల రాజధాని అనడాన్ని సాక్షి టీవీలో సమర్థించడాన్ని ఏవిధంగా తీసుకోవాలి ? వైసీపీ ఇంకా తన విధానాన్ని మార్చుకోకుండా మహిళల మీద ఇలాంటి వ్యాఖ్యల్ని సాక్షి ఛానెల్‌ లో ప్రోత్సహిస్తోందని, ఆంధ్రప్రదేశ్ సెక్స్ వర్కర్ విషయంగా మొదటి స్థానంలో ఉందని తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న సాక్షి ఛానెల్‌ చర్యలు ఉంటాయని ప్రభుత్వ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి.)

అమరావతి: రాజధాని అమరావతిపై అనుచిత వ్యాఖ్యలతో మహిళలను అవమానించారని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మండిపడ్డారు..సాక్షి మీడియాలో ఓ చర్చ సందర్భంగా అమరావతి ప్రాంత మహిళలపై జర్నలిస్ట్ కృష్ణంరాజు చేసిన వ్యాఖ్యలను ఉపముఖ్యమంత్రి ఖండించారు..రాజధానిపై కుట్రలు చేసే వారిపై చర్యలు తప్పవని,,బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని పవన్ కల్యాణ్ హెచ్చరించారు..

జర్నలిస్ట్ ముసుగులో అనుచిత వ్యాఖ్యలు చేయడం దారుణమని ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు..ఈ వ్యాఖ్యలపై ప్రజలు, అధికారులు విశ్లేషించాలని అభిప్రాయపడ్డారు.. ఆ వ్యాఖ్యలతో తమకు సంబంధం లేదంటూ సాక్షి ఛానల్‌ తప్పించుకునే ప్రయత్నం చేస్తోందన్నారు.. కులముద్రలు వేసి మహిళలను అవమానిస్తున్నారంటూ అవేదన వ్యక్తం చేశారు..ఈ ప్రాంతంలో విలసిల్లిన బౌద్ధాన్నీ అవహేళన చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.. అమరావతి ప్రాంతానికి బలమైన చారిత్రక, ఆధ్యాత్మిక, బౌద్ధ ధర్మ నేపథ్యం ఉన్న విషయాన్ని విస్మరించవద్దని హితవు పలికారు..రాజధాని కోసం భూములిచ్చిన వారిలో 32 శాతం ఎస్సీ, ఎస్టీ,,14 శాతం బీసీ రైతులు ఉన్నారని తెలిపారు..
వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్‌కు చెందిన సాక్షి మీడియాలో చర్చ కార్యక్రమం వేదికగా చేసిన కామెంట్లు ప్రస్తుతం తీవ్ర దుమారం రేపుతున్నాయి. అయితే ఈ చర్చ కార్యక్రమంలో పాల్గొన్న జర్నలిస్ట్ కృష్ణంరాజు చేసిన వ్యాఖ్యలను.. ఈ ప్రొగ్రామ్‌లో కొమ్మినేని శ్రీనివాసరావు ఖండించకపోగా.. ఆయన వ్యంగ్యంగా కామెంట్ చేయడంపైనా పెద్దఎత్తున ఆగ్రహం వ్యక్తమవుతోంది..సాక్షి మీడియా యాజమాన్యం సైతం దీనిని సమర్థించుకొనే విధంగా.. ఈ వ్యవహారంతో తమకు సంబంధం లేదని స్పష్టం చేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ఈ పరిణామాల నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం ఈ అంశాన్ని సీరియస్‌గా తీసుకుంది.. ఇప్పటికే ఈ వ్యాఖ్యలపై రాజధాని ప్రాంత రైతులు, మహిళలు పెద్దఎత్తున ఉద్యమ బాట పట్టారు..24 గంటల్లో స్పందించకుంటే,,సాక్షి కార్యాలయాలను ముట్టడిస్తామని హెచ్చరించారు..మహిళలపై వ్యాఖ్యలు చేసిన వారిని వదిలిపెట్టబోమని తేల్చి చెప్పారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *