ఉద్యోగుల సమస్యల సానుకూల పరిష్కారానికి అన్నివిధాలా ప్రయత్నం చేస్తాం-సిఎస్
అమరావతి :రాష్ట్రంలో పనిచేస్తున్న వివిధ ప్రభుత్వ ఉద్యోగులు,ఫెన్సనర్ల సమస్యల సానుకూల పరిష్కారానికి అవసరమైన ప్రయత్నం చేయడం జరుగుతుందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ స్పష్టం చేశారు.రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వారి ఆదేశాల మేరకు రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన పలు అంశాలపై చర్చించేందుకు బుధవారం రాష్ట్ర సచివాలయంలో సిఎస్ అధ్యక్షతన జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశం జరిగింది.ఈసమావేశంలో వివిధ ఉద్యోగ సంఘాల ప్రతినిధులు ఉద్యోగులకు సంబంధించి పెండిగ్ డిఏలు,పిఆర్సి బకాయిలు,ఆర్జిత సెలవుల నగదు చెల్లింపు బాకాయిలు తదితర అంశాలను సిఎస్ దృష్టికి తెచ్చారు.అనంతరం సిఎస్ మాట్లాడుతు ఈప్రభుత్వం వచ్చాక మొదటి సారి జరిగిన ఈ జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశంలో ఉద్యోగ సంఘాల ప్రతినిధులు తెలిపిన అన్ని అంశాలను నమోదు చేయడం జరిగిందని వాటన్నిటినీ ముఖ్యమంత్రి వర్యుల దృష్టికి తీసుకువెళ్ళి సకాలంలో పరిష్కారం అయ్యే విధంగా ప్రయత్నం చేయడం జరుగుతుందని సిఎస్ విజయానంద్ ఉద్యోగ సంఘాలకు చెప్పారు.