మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలు బాధకరం-చిరంజీవి
హైదరాబాద్: నాగచైతన్య, సమంత విడాకులపై మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలపై అటు సినీ పరిశ్రమ,,ఇటు రాజకీయ వర్గాల్లో తీవ్ర దుమారం రేపుతున్నాయి..మంత్రి కొండా.సురేఖ వ్యాఖ్యలపై మెగా స్టార్ యాక్టర్ చిరంజీవి స్పందించారు..గౌరవనీయులైన మహిళా మంత్రి చేసిన అవమానకర వ్యాఖ్యలు చూసి నేను చాలా బాధపడ్డాను..అందరి చూపు తమవైపు తిప్పుకునేందుకు సినీ పరిశ్రమకు చెందిన సెలబ్రిటీలు,,సినీ సోదర సభ్యులను టార్గెట్ చేయడం బాధకరం..మా సభ్యులపై ఇలాంటి మాటల దాడులను చిత్రపరిశ్రమ తరపున అంతా ముక్తకంఠంతో వ్యతిరేకిస్తాం.. సంబంధం లేని వ్యక్తులను,,ప్రత్యేకించి మహిళలను తమ రాజకీయ వ్యవహారాల్లోకి లాగడం,,కల్పిత ఆరోపణలతో రాజకీయ నేతలు ఎవరూ ఈ స్థాయికి దిగజారకూడదు..రాజకీయ నాయకులు, గౌరవప్రదమైన స్థానాల్లో ఉన్న వ్యక్తులు ప్రజలకు స్పూర్తిదాయకంగా మంచి ఉదాహరణగా ఉండాలి..ఈ వివాదానికి కారణమైన వ్యక్తులు సవరణలు చేసుకుని,,ఈ వ్యాఖ్యలను వెంటనే ఉపసంహరించుకుంటారని విశ్వసిస్తున్నానని సుదీర్ఘ సందేశాన్ని పేర్కొన్నారు..
మంత్రి కొండా సురేఖ:- వివాదాస్పద వ్యాఖ్యలపై సర్వత్రా విమర్శలు వస్తున్న నేపథ్యంలో తాను చేసిన వ్యాఖ్యలను మంత్రి కొండా సురేఖ వెనక్కి తీసుకున్నట్టు ప్రకటించారు..మహిళా నాయకుల పట్ల ఓ నాయకుడి చిన్నచూపు ధోరణి ప్రశ్నించాలన్నదే తన ఉద్దేశమని చెప్పారు.. మీ మనోభావాలు దెబ్బతీయాలని తన ఉద్దేశం కాదని తెలిపారు.. స్వయంశక్తితో మీరు ఎదిగిన తీరు నాకు ఆదర్శం.. మీరు మనస్తాపానికి గురైతే నా వ్యాఖ్యలు ఉపసంహరించుకుంటున్నానని,,అన్యదా భావించకూడదని మంత్రి కొండా సురేఖ,,సోషల్ మీడియా ద్వారా నటి సమంతకు తెలిపారు.