AP&TG

రాష్ట్రవ్యాప్తంగా పలువురు పీపీలు, ఏపీపీలపై ప్రభుత్వం క్రమశిక్షణా చర్యలు!

అమరావతి: నిబంధనలు ఉల్లఘించినందుకు,న్యాయవ్యవస్థలో జవాబుదారీతనాన్ని పెంచేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పబ్లిక్ ప్రాసిక్యూటర్లు (PPలు),,అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్లు (APPలు)గా పనిచేస్తున్న 17 మంది న్యాయ నిపుణులపై క్రమశిక్షణా చర్యలు తీసుకుంది..రాష్ట్రవ్యాప్తంగా పలు కోర్టుల్లో చేసే ఇద్దరు పీపీలు, 15 మంది ఏపీపీలను క్రమశిక్షణా చర్యల్లో భాగంగా తొలగించాలని పీపీ డైరెక్టర్ సిఫార్సు మేరకు వేటు పడింది..

కర్నూలు సెషన్స్ కోర్టులో పీపీ వెంకటరెడ్డిపై వేటు వేసిన ప్రభుత్వం.. ఒంగోలు ప్రిన్సిపల్ డిస్ట్రిక్ అండ్ సెషన్స్ కోర్టులో పీపీ సుంధర తొలగింపు..కర్నూలు జిల్లా ఆత్మకూరు కోర్టులో అసిస్టెంట్ పీపీ అసిఫ్ ఆలీ ఖాన్ తొలగింపు.. కర్నూలు నాలుగో అడిషనల్ జిల్లా సెషన్ కోర్టు ఏపీపీ ప్రకాశ్‌రెడ్డి తొలగింపు.. కర్నూలు అడిషనల్ ఏపీపీ కోర్టులో ఏపీపీ బాల రంగస్వామి తొలగింపు.. అనంతపురం జిల్లా గుత్తి నాలుగో అదనపు జిల్లా కోర్టులో ఏపీపీ సుదర్శన్‌రెడ్డి తొలగింపు..కడప ఏడో అదనపు జడి కోర్టులో ఏపీపీ మొఘల్ ఎస్మిన్ బేగం తొలగింపు.. కడప జిల్లా 6వ అడిషనల్ అండ్ డిస్టిక్ సెషన్స్ కోర్టులో ఏపీపీ ప్రతాప్ కుమార్‌రెడ్డి తొలగింపు..మదనపల్లి కోర్టులో ఏపీపీగా ఉన్న వి.జయనారాయణ రెడ్డిపై వేటు.. రాయచోటి ఐదో అడిషనల్ డిస్ట్రిక్ అండ్ సెషన్స్ కోర్టులో ఏపీపీ టి.జగన్మోహన్ రెడ్డిపై వేటు..మచిలీపట్నం అడిషనల్ జడ్జి కోర్టులో ఏపీపీ సియాద్రి చిన్నారావు తొలగింపు.. గుడివాడ 11వ అదనపు డిస్ట్రిక్ సెషన్స్ కోర్టులో ఏపీపీ షేక్ రెహ్మతుల్లా తొలగింపు..గుంటూరు అడిషనల్ డిస్ట్రిక్ సెషన్స్ కోర్టులో ఏపీపీ పల్లపు కృష్ణ తొలగింపు..గుంటూరు నాలుగో అసిస్టెంట్ జడ్జి కోర్టులో ఏపీపీ జోత్స్న తొలగింపు.. గుంటూరు 12వ జిల్లా అడిషనల్ డిస్ట్రిక్ అండ్ సెషన్స్ కోర్టులో ఏపీపీ బొడ్డు కోటేశ్వరరావుపై వేటు.. నెల్లూరు అసిస్టెంట్ సెషన్స్ కోర్టులో ఏపీపీ ప్రసాదరావుపై వేటు..వీరిపై తదుపరి చర్యలు తీసుకోవాలని డైరెక్టర్ ప్రాసిక్యూషన్స్ కు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం.?

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *