జైలు అంటే భయపడాల్సిన అవసరం లేదని జైల్లో వున్న వైసీపీ నాయకులే అంటున్నారు-కాకాణి
కాకాణి ఎట్టకేలకు విడుదల…
నెల్లూరు: జైళ్లు,కేసులు మా లక్ష్యసాధన నిరోధించలేవని,,తమ ప్రభుత్వం హాయంలో కూడా ఇలాంటి కేసులు పెట్టలేదని మాజీ మంత్రి కాకాణి.గోవర్దన్ రెడ్డి అన్నారు..బుధవారం అయన బెయిల్ పై నెల్లూరు సెంట్రల్ జైలు నుంచి విడుదలైన సందర్బంలో మీడియాతో మాట్లాడుతూ సెంట్రల్ జైల్లో రకారకల కేసులను ఎదుర్కొంటున్న వైసీపీ నాయకులు,,జైలు అంటే లెక్కచేయాల్సి అవసరం లేదని,,ప్రభుత్వ విధానలపై పోరాట చేస్తున్నే వుంటామని అంటున్నారని తెలిపారు..
86 రోజులు తనను జైల్లో:- కూటమి ప్రభుత్వం చేస్తున్న తప్పులను నిలదీస్తునే వుంటామన్నారు..86 రోజులు తనను జైల్లో పెట్టినంత మాత్రన,చంద్రబాబు చేస్తున్న మోసలను,కుట్రలను ప్రజా కోర్టులో ప్రశ్నిస్తానే వుంటామన్నారు..సోమిరెడ్డి,సోమిరెడ్డి కొడుకు సర్వేపల్లిలో చేస్తున్న దొపిడికి అడ్డు,అదుపు లేకుండా పోయిందని,,భవిష్యత్ లో వీటిపైన విచారణ జరుగుతుందని హెచ్చరించారు..
బెయిల్ షరతులు:- దేశంలో ఎక్కడా లేని సంప్రదాయంను ఏపీలో కూటమి ప్రభుత్వం తీసుకొచ్చింది బెయిల్ షరతులు దృష్ట్యా కేసు గురించి నేను మాట్లాడకూడదు..నాపై చిత్రవిచిత్రమైన కేసులు పెట్టారు.. నేను తప్పు చేయలేదు కాబట్టి బెయిల్ ఇవ్వండి అన్నాను.. తప్ప అనారోగ్యాన్ని కారణంగా చూపలేదన్నారు..బెయిల్ షరతుల దృష్ట్య కేసులో చార్జీ షీట్ ఫైల్ చేసేంత వరకు నేను జిల్లాలో వుండకూడదని తెలిపారు.