భారతదేశంపై వున్న ఎగుమతి ఆంక్షలను తొలిగించిన చైనా
అమరావతి: భారతదేశానికి ఎరువులు, అరుదైన మినరల్స్,,టన్నెల్ బోరింగ్ యంత్రాల ఎగుమతిపై వున్న ఆంక్షలను చైనా ఎత్తివేసింది..అమెరికా,,భారతదేశంపై టారిఫ్ లను విధిస్తున్న నేపధ్యంలో మోదీ ప్రభుత్వం,అమెరికా అంక్షలకు ధీటుగా జావాబు ఇచ్చేందుకు చర్యలను చేపట్టింది..ఇందులో బాగంగా గత నెలలో చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యి, భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ మధ్య చర్చలు జరిగిన తర్వాత చైనా ఎగుమతి అంక్షలను తొలగిస్తు చర్యలు తీసుకుంది..
రెండు రోజుల భారత పర్యటనలో బాగంగా భారతదేశంకు వచ్చిన వాంగ్ యి, జైశంకర్‌కు మూడు వస్తువులపై న్యూఢిల్లీ అభ్యర్థనలకు బీజింగ్ స్పందించడం ప్రారంభించిందని తెలిపినట్లు సమాచారం..రబీ సీజన్‌లో ఎరువులపై ఆంక్షలు వుండడం వల్ల డై-అమ్మోనియం ఫాస్ఫేట్ (DAP) సరఫరాకు అంతరాయం కలిగింది..దింతో భారతదేశం ప్రత్నమాయ మార్గాల్లో DAPని సేకరిస్తొంది..అలాగే దేశంలోని మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు ఉద్దేశించిన టన్నెల్ బోరింగ్ యంత్రాలు, చైనాలోని విదేశీ కంపెనీలు తయారు చేసిన పరికరాలు కూడా నిలిచిపోయాయి..దేశంలో వేగంగా జరుగుతున్న మౌలిక సదుపాయల ప్రాజెక్టుల్లో కొంత ఆలస్యం జరుగుతు వస్తొంది..భవిష్యత్ అవసరాలను దృష్టిలో వుంచుకు ఆత్మనిర్భర్ భారత్ లో బాగంగా కేంద్ర ప్రభుత్వం దేశీయంగా అరుదైన ఎర్త్ మినరల్స్ ను తయారీని ప్రోత్సహించడానికి భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖ ₹1,345 కోట్ల సబ్సిడీ పథకాన్ని కూడా ప్లాన్ సిద్దం చేస్తోంది.