వాయుగుండం దక్షిణ ఒడిశా-ఉత్తరాంధ్ర తీరాలను దాటే అవకాశం
అమరావతి: ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఉత్తరాంధ్ర,దక్షిణ ఒడిశా తీరాలకు ఆనుకుని ఉన్న పశ్చిమమధ్య,వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని,, ఇది పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ తదుపరి సోమవారం వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు. మంగళవారం మధ్యాహ్నానికి దక్షిణ ఒడిశా-ఉత్తరాంధ్ర తీరాలను దాటే అవకాశం ఉందని వెల్లడించారు. అల్పపీడనం ప్రభావంతో రాబోయే రెండు రోజులు కోస్తాలో అక్కడక్కడ భారీ నుంచి అతిభారీ వర్షాలు, అలాగే రాయలసీమ జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు.