ద్వారకా ఎక్స్ ప్రెస్‌వేను ప్రారంభించి,జాతికి అంకితం చేసిన ప్రధాని మోదీ
అమరావతి: గురుగ్రామ్ నుంచి ఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంకు 20 నిమిషాల్లో చేరుకునే సాలభ్యం నేడు (ఆదివారం) ప్రధాన మంత్రి నరేంద్రమోదీ ప్రారంభించిన ద్వారకా ఎక్స్ ప్రెస్‌వే ద్వారా కలుగుతుంది..రూ.11 వేల కోట్లతో చేపట్టిన రెండు హైవే ప్రాజెక్టులు,,ద్వారకా ఎక్స్ ప్రెస్‌వే,,NCRలో అర్బన్ ఎక్స్ టెన్షన్ రోడ్-2 ప్రాజెక్ట్ ను జాతికి అంకితం చేశారు..ఢిల్లీ శివారు ప్రాంతాలను కలుపుతూ 76 కిలోమీటర్లు అర్బన్ ఎక్స్ టెన్షన్ రోడ్డును కారిడార్ ప్రాజెక్ట్ తో అనుసంధానం చేశారు.. ఢిల్లీ-NCR పై ట్రాఫిక్ సమస్యను చాలా వరకు తగ్గిస్తుంది.. ఈ ఎక్స్ ప్రెస్ వే ద్వారా ఢిల్లీ-NCR మీదుగా పశ్చిమ ప్రాంతాల నుంచి వచ్చి ఢిల్లీకి వచ్చి వెళ్ళే ప్రజల ప్రయాణం గతంలో కంటే సులభం అవుతుంది..నేటి వరకు ఈ ప్రాంతాల నుంచి వచ్చే ప్రజలు ఢిల్లీలోని రద్దీగా ఉండే రింగ్ రోడ్డు ద్వారా వెళ్ళాల్సి వచ్చేది..ఆ ప్రాంతంలో ట్రాఫిక్ జామ్‌ల కారణంగా గంటల తరబడి ప్రయాణించే వారు..ద్వారకా ఎక్స్ ప్రెస్‌వే ప్రారంభం కావడంతో, రింగ్ రోడ్డుపై వాహనాల రద్దీ తగ్గుతుంది..ఈ రింగ్ రోడ్డు NH-48, NH-44, బారాపుల్లా వంటి ప్రధాన రహదారులతో కలుస్తుంది.