ఆపరేషన్ సింధూర్‌పై ఎయిర్ చీఫ్ మార్షల్ అమర్ ప్రీత్ సింగ్ కీలక ప్రకటన
అమరావతి: ఆపరేషన్ సింధూర్‌పై ఎయిర్ చీఫ్ మార్షల్ అమర్ ప్రీత్ సింగ్ శనివారం కీలక ప్రకటన చేశారు.. బెంగళూరులో జరిగిన ఎయిర్ చీఫ్ మార్షల్ LM కాత్రే స్మారక ఉపన్యాసంలో అయన మాట్లాడుతూ, ఆపరేషన్ సింధూర్ సందర్భంగా పాకిస్తాన్‌కు చెందిన ఐదు ఫైటర్ జెట్లను కూల్చేశామని తెలిపారు..S-400 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ సాయంతో 5 పాకిస్తాన్ ఫైటర్ జెట్లను పేల్చివేశామన్నారు.. వీటితో పాటు(AWACS) “ఎయిర్‌బర్నీ ఎర్లీ వార్నింగ్ అండ్ కంట్రోల్ ఎయిర్ క్రాఫ్ట్”ను కూడా కూల్చేశామని వెల్లడించారు..రెండు వైమానిక స్థావరాలు ధ్వంసం చేశాం.. మే 9, 10 తేదీల్లో ఆపరేషన్ సిందూర్ నిర్వహించమన్నారు.. మే 9వ తేదీ రాత్రి ఎక్కువగా పాక్ ఉగ్ర శిబిరాలపై దాడులు జరిపాన్నారు..డ్రోన్లు,, S-400 గగనతల రక్షణ వ్యవస్థ చాలా బాగా పనిచేసిందన్నారు..పాకిస్తాన్ యుద్ధ విమానాలు భారత గగనతలంలోకి ప్రవేశించకుండా అడ్డుకొవడంతో పాటు వాటిని సమర్థవంతంగా కూల్చివేశామని తెలిపారు.. భారతదేశంలో ఉగ్రవాదంను ప్రొత్సహిస్తే జరిగే పరిణామాలను ఆపరేషన్ సింధూర్‌తో పాక్‌కు స్పష్టమైన సందేశం ఇచ్చామని వెల్లడించారు.