AP&TGCRIME

ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో వైసీపీ ఎంపీ మిథున్‌రెడ్డి అరెస్ట్

అమరావతి: ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో వైసీపీ ఎంపీ మిథున్‌రెడ్డికి నోటీసులు ఇచ్చిన పోలీసులు అరెస్ట్ చేశారు.. అరెస్ట్‌ పై ఎంపీ కుటుంబసభ్యులకు సిట్ అధికారులు సమాచారం ఇచ్చారు.. కోర్టుకు హాజరుపరిచే అంశంపై మరికొంతసేపట్లో నిర్ణయం తీసుకోనున్నారు..ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో మిథున్‌రెడ్డి A-4 నిందితుడిగా ఉన్నారు.. ఈ కేసు విషయంపై విచారించేందుకు సిట్ అధికారులు శనివారం మిథున్ రెడ్డిని కార్యలయంకు పిలిచి 7 గంటల పాటు విచారించారు..2019-2024 మధ్య వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన రూ.3,200 కోట్ల లిక్కర్ స్కామ్ అక్రమాలకు సంబంధించి స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (SIT) ఎంపీ మిథున్ రెడ్డితో కలిపి ఇప్పటివరకూ 12 మంది అరెస్ట్ చేసింది..ఇంకా మరి కొందరిని అరెస్ట్ చేసే అవకాశం వుంది.

మద్యం కుంభకోణంలో సిట్‌ ఛార్జ్‌షీట్‌ దాఖలు:- వైసీపీ హయాంలో జరిగిన మద్యం కుంభకోణం పై సిట్‌ ఛార్జ్‌షీట్‌ దాఖలు చేసింది. 300 పేజీలతో ప్రిలిమినరీ ఛార్జ్‌షీట్‌ను సిట్‌ అధికారులు కోర్టుకు సమర్పించారు. దీనితో పాటు వందకు పైగా ఫొరెన్సిక్‌ ల్యాబ్‌ నివేదికలు, ఎలక్ట్రానిక్‌ పరికరాలను జతచేశారు. మొత్తం రూ.62 కోట్లు సీజ్‌ చేసినట్లు అధికారులు పేర్కొన్నారు. 268 మంది సాక్షులను విచారించినట్లు ఛార్జ్‌షీట్‌లో వెల్లడించారు. 11 మంది వాంగ్మూలాలు, రిమాండ్‌ రిపోర్టులు, ఇతర పత్రాలను దీనికి జతచేశారు.

20 రోజుల్లో మరో ఛార్జ్‌షీట్‌:- వివిధ బ్యాంకులు, ఆస్పత్రులు, బంగారం షాపులు, రియల్‌ ఎస్టేట్‌ కంపెనీల్లో పెట్టుబడుల వివరాలకు సంబంధించిన స్టేట్‌మెంట్‌లను కూడా స్వాధీనం చేసుకుని ఛార్జ్‌షీట్‌లో సిట్‌ పొందుపరిచింది. వైకాపా ఎంపీ మిథున్‌రెడ్డి పేరు దీనిలో ఉన్నప్పటికీ ఆయన పాత్రను అధికారులు పేర్కొనలేదు. మద్యం ముడుపులు షెల్‌ కంపెనీల ద్వారా రావడం, బ్లాక్‌ను వైట్‌గా మార్చడం తదితర అంశాలను వెల్లడించింది. 20 రోజుల్లో మరో ఛార్జ్‌షీట్‌ దాఖలు చేస్తామని సిట్‌ తెలిపింది. దర్యాప్తు కీలక దశలో ఉందని.. త్వరలో మరిన్ని విషయాలు వెలుగులోకి వస్తాయని అధికారులు చెబుతున్నారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *