ముంబైలో రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదు-IMD
అమరావతి: దేశ వాణిజ్య రాజధాని ముంబై నగరంలో ఆదివారం అర్థరాత్రి దాటిన తరువాత నుంచి సోమవారం ఉదయం 6 గంటల వరకు రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదైంది..వేకువజామున నుంచి ఉదయంలోపు దాదాపు 30 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.. అత్యధికంగా గోవండి ప్రాంతంలో 31.5 సెంటీమీటర్లు, పోవాయ్ లో 31.4 సెంటీమీటర్ల వర్షం కురిసింది.. పలు లోతట్టు ప్రాంతాల్లో రైలు పట్టాలపైకి వర్షపు నీరు చేరడంతో సబర్బన్ రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.. సెంట్రల్ రైల్వే రూట్లలో లోకల్ రైల్వే పట్టాలు దెబ్బతిన్నాయి.. భారీ వర్షం కారణంగా ముంబైలోని పలు రహదారులపైకి భారీగా వర్షపునీరు చేరడంతో వాహదారుల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది..రానున్న మూడ్రోజులు ముంబైతో సహా మహారాష్ట్రలో భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ వెల్లడించింది..IMD హెచ్చరికతో బీఎంసీ పరిధిలోని స్కూల్స్, కాలేజీలకు మహారాష్ట్ర ప్రభుత్వం సెలవులు ప్రకటించింది.. ముంబై యూనివర్శిటీల్లో సోమవారం జరగాల్సిన పరీక్షలను వాయిదా వేశారు..అలాగే భారీ వర్షాల కారణంగా విమానాశ్రయాల్లో విమాన రాకపోకలకు అంతరాయం ఏర్పడుతుంది..27 మిమానాలను అహ్మదాబాద్, హైదరాబాద్, ఇండోర్ లకు మళ్లించినట్లు సంబంధిత అధికార వర్గాలు తెలిపాయి.. లోతట్టు ప్రాంతాల్లో సహాయక చర్యలను వేగవంతం చేయాలని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్ నాథ్ షిండే అధికారులను ఆదేశించారు.