చైనా ఆర్థిక మంత్రి వాంగ్ యితో వివరణాత్మక చర్చలు -జయశంకర్
అమరావతి: బీజింగ్‌లో పొలిట్‌బ్యూరో సభ్యుడు,ఆర్థిక మంత్రి వాంగ్ యితో వివరణాత్మక చర్చలు జరిగాయని భారతదేశ విదేశాంగశాఖ మంత్రి జయశంకర్ సోషల్ మీడియా వేదికగా తెలిపారు..ఈనెల 14 నుంచి 15 తేదిల్లో షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ లోని విదేశాంగ మంత్రుల స్థాయి సమావేశాల్లో పాల్గొందుకు సోమవారం చైనాలోని బీజింగ్ చేరుకున్న జయశంకర్ కు మంత్రి వాంగ్ యి స్వాగతం పలికారు..ఈ సందర్బంలో భారత్-చైనా దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలకు,,స్థిరమైన,,నిర్మాణాత్మక సంబంధాన్ని భవిష్యత్ అవసరాలను దృష్టిలో వుంచుకుని విదేశాంగా విధానం యొక్క ఆవశ్యకత గురించి మాట్లాడారని వెల్లడించారు..

ఇరు దేశాల మధ్య సరిహద్దుకు సంబంధించిన అంశాలను పరిష్కరించడం, ప్రజల మధ్య సంబంధాలను సాధారణ స్థితికి తీసుకుని రావడం,,నిర్బంధ వాణిజ్య చర్యలు & అడ్డంకులను తొలగించుకోవడం తమ బాధ్యతగా బావించాల్సి వుంటుందని పేర్కొన్నారు..అలాగే పరస్పర గౌరవం, పరస్పర ఆసక్తి,,పరస్పర సున్నితత్వం అనే పునాదిపై, సంబంధాలు సానుకూల పథంలో అభివృద్ధి చెందుతాయని నమ్మకంగా ఉందని వెల్లడించారు..మంగళవారం టియాంజిన్‌లో జరిగే SCO విదేశాంగ మంత్రుల సమావేశానికి హాజరు కావడానికి ఎదురుచూస్తున్నట్లు తెలిపారు.. ద్వైపాక్షిక సంబంధాల చర్చల్లో మంచి ఫలితాలు-నిర్ణయాలను తీసుకునేందుకు భారతదేశం కట్టుబడి ఉందని వెల్లడించారు.

