యోగాను ఒక ఉద్యమంలా సమాజంలోకి తీసుకెళ్లాలి-ప్రధాని మోదీ
గిన్నీస్ రికార్డ్స్..
విశాఖపట్నం: 175 దేశాల్లో యోగా చేయడం సాధారణ విషయం కాదని, యోగా ప్రపంచాన్ని కలిపిందని,,ఇది భారతదేశంతోనే సాధ్యమైందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు..11వ ప్రపంచ యోగా దినోత్సవం సందర్భంగా శనివారం విశాఖ నగరంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యోగాంధ్ర కార్యక్రమం నిర్వహించింది.,ఈ కార్యక్రమంలో ప్రధాని పాల్గొన్న సందర్బంలో మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది జీవనశైలిని యోగా మార్చిందన్నారు..వన్ ఎర్త్…వన్ హెల్త్ థీమ్‌తో ఈ సారి యోగా డే జరుపుకుంటున్నామన్నారు..ప్రపంచంతో మనం అనుసంధానం కావడానికి యోగా ఉపయోగపడుతుందని తెలిపారు..అందరి క్షేమమే నా కర్తవ్యమని భారతీయ సంస్కృతి నేర్పుతుందని,, ప్రపంచం ఏదో ఒక సమస్యను ఎదుర్కొంటుందన్నారు..ఈ పరిస్థితుల్లో యోగా శాంతికి తోడ్పడుతుందని,,అలాగే యోగా మనలో మానవత్వం పెంచుతుందన్నారు..వ్యక్తిగత క్రమశిక్షణకు యోగా ఒక అద్భుత సాధనం అని అన్నారు.. నేను నుంచి మనం అనే భావనకు తీసుకెళ్లే ఆయుధం యోగా సాధన అని తెలిపారు..యోగాను ఒక ఉద్యమంలా తీసుకెళ్లాలని,,అందరికి యోగాతో ప్రతి రోజు మొదలు కావలని ప్రధాని మోదీ సూచించారు..ప్రగతి,, ప్రకృతి సంగమస్థలి విశాఖ నగరం… 11వ ప్రపంచ యోగా దినోత్సవంను ఈ స్థాయిలో నిర్వహించిన చంద్రబాబు,,పవన్,, లోకేష్‌కు ప్రధాని అభినందనలు తెలిపారు..

సీఎం చంద్రబాబు:-11వ అంతర్జాతీయ యోగాడే రికార్డు నెలకొల్పిందని సీఎం చంద్రబాబు అన్నారు..12 లక్షల ప్రాంతాల్లో శనివారం యోగా చేస్తున్నారన్నారు..ఇదే సమయంలో ప్రపంచవ్యాప్తంగా 10 కోట్ల మంది యోగా చేస్తున్నారని చెప్పారు..విశాఖలో నిర్వహించిన యోగాంధ్ర కార్యక్రమంతో రికార్డు సృష్టించినట్టు చెప్పారు..శుక్రవారం 22 వేల మంది గిరిజన విద్యార్థులు సూర్య నమస్కారాలతో గిన్నిస్ రికార్డు సాధించారన్నారు..
డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్:-ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మాట్లాడుతూ,, ప్రజలందరికి యోగా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు..దేశానికి యోగాను అందించిన ఆదియోగి,, పతంజలికి నమస్కారాలు తెలిపారు..యోగాను ప్రపంచ వ్యాప్తం చేసిన దార్శనికుడు ప్రధాని మోదీ అని పవన్ కల్యాణ్ చెప్పారు..యోగా భారతీయులకు దక్కిన గౌరవమన్నారు..యోగాకు 175 దేశాల మద్దతు కూడగట్టిన శక్తి ప్రధాని మోదీదేనని డిప్యూటీ సీఎం కొనియాడారు.
గిన్నిస్ రికార్డు:- అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా విశాఖపట్టణం వేదికగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించిన యోగాంధ్ర-2025 కార్యక్రమం గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు సాధించింది..ఒకే స్ట్రెచ్‌లో 3. 20 లక్షల మందికిపైగా యోగా చేయడం ప్రపంచంలోనే రికార్డు.. దీంతోపాటు 25వేల మంది గిరిజన విద్యార్థులు శుక్రవారం ఒకేచోట చేసిన సూర్య నమస్కారాలకు గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో చోటు దక్కింది..మంత్రులు నారా లోకేశ్, సత్యకుమార్ లకు గిన్నిస్ రికార్డు ధ్రువపత్రాలను నిర్వాహకులు అందజేశారు.

