AP&TGNATIONAL

స్టాఫ్ సెలక్షన్ కమిషన్ పోస్టుల భర్తీ కోసం..

నెల్లూరు: వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో ఉన్న భారత ప్రభుత్వ మంత్రిత్వ శాఖలు/విభాగాలు/సంస్థలు తెలిపిన వివరాల ప్రకారం వివిధ పోస్టులకు ప్రత్యక్ష నియామకం కోసం స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఫేజ్ 13/2025 నోటిఫికేషన్‌ను ప్రచురించినట్లు జిల్లా కలెక్టర్ ఆనంద్ తెలిపారు. పోస్టుల భర్తీ కోసం కమిషన్ ఓపెన్ కాంపిటీటివ్ కంప్యూటర్ ఆధారిత పరీక్షను నిర్వహిస్తుంది.దరఖాస్తులను కమిషన్ అధికారిక వెబ్‌సైట్ https://ssc.gov.in ద్వారా మాత్రమే ఆన్‌లైన్‌లో సమర్పించాలన్నారు.. ఈనెల 23 లోగా ఆన్‌లైన్ దరఖాస్తులను సమర్పించాలని, ఈనెల 24 లోగా ఆన్‌లైన్ ఫీజు చెల్లింపునకు చివరి తేదీగా పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని జిల్లాలోని నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ కోరారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *