ప్రతి ఇంటిపై మువ్వన్నెల జెండా రెపరెపలాడేలా,హర్ ఘర్ తిరంగా-కలెక్టర్
నెల్లూరు: ఆజాదికా అమృత్ మహోత్సవాల్లో భాగంగా ఈనెల 13వ తేదీ వరకు జిల్లాలో హర్ ఘర్ తిరంగా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ ఆనంద్ తెలిపారు. ఇందులో భాగంగా ఈనెల 6వ తేదీన హర్‌ఘర్ తిరంగా కార్యక్రమంపై ఎగ్జిబిషన్, 7న ర్యాలీలు, 8న డ్రాయింగ్, పెయింటింగ్, చర్చావేదికలు, పోస్టర్ మ్యాకింగ్, జింగిల్స్ రూపొందించడంపై పోటీలు నిర్వహించడం, 9న సాంస్కృతిక కార్యక్రమాలు, 10న స్వాతంత్య్ర సమరయోధుడు వివి గిరి జయంతి నిర్వహణ, సాయంకాలపు హారతులు, 11న వారసత్వ నడకలు, 12న క్రీడాపోటీలు, 13న జాతీయ పతాకంతో సెల్ఫీలు దిగుట మొదలగు దేశ సమగ్రత, జాతీయభావం పెంపొందించే కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు కలెక్టర్ చెప్పారు. ప్రతి ఇంటిపై మువ్వన్నెల జెండా రెపరెపలాడేలా చర్యలు చేపట్టాలన్నారు. ప్రజలందరూ హర్‌ఘర్ తిరంగా కార్యక్రమంలో విరివిగా పాల్గొనాలని కలెక్టర్ పిలుపునిచ్చారు.