బీఎస్సీ నర్సింగ్ కోర్సులో అడ్మిషన్లకు ఏపీఎన్ సెట్-2025-వైస్ ఛాన్సలర్
జూన్ 6 వరకు దరఖాస్తులు స్వీకరణ..
అమరావతి: ప్రపంచ వ్యాప్తంగా నర్సింగ్ కు మంచి ఉపాధి అవకాశాలు, ఆదరణ ఉన్నాయని నర్సింగ్ కోర్సు చేసేవారికి ఇదొక మంచి అవకాశమని డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య విజ్ఙాన విశ్వ విద్యాలయం వైస్ ఛాన్సలర్ డాక్టర్ పి. చంద్రశేఖర్ తెలియజేశారు. డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య విజ్ఙాన విశ్వ విద్యాలయంలో మీడియా సమావేశంలో వైస్ ఛాన్సలర్ మాట్లాడుతూ నేను 12వ వైస్ చాన్స్ లర్ గా డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య విజ్ఙాన విశ్వ విద్యాలయం కు వచ్చానన్నారు. బీఎస్సీ నర్సింగ్ కోర్సు లో అడ్మిషన్లకు ప్రత్యేక ఎంట్రన్స్ పరీక్ష (APNCET-2025) నిర్వహించాలని ఇండియన్ నర్సింగ్ కౌన్సిల్ తెలియజేసిందని అందుకు అనుగుణంగా మే 27, 2025న నోటిపికేషన్ విడుదల చేసామన్నారు. జూలై 6, 2025 ఏపీఎన్ సెట్ – 2025 ప్రవేశ పరీక్ష నిర్వహిస్తున్నామన్నారు. బీఎస్సీ నర్సింగ్ కోర్సులో 2025-26 సంవత్సరం ప్రవేశాలకుగాను డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య విజ్ఙాన విశ్వ విద్యాలయం ఇప్పటికే నోటిఫికేషన్ విడుదల చేసిందన్నారు. ధరఖాస్తులను 28.05.2025 నుండి 20.06.2025 వరకు స్వీకరిస్తున్నామన్నారు. చివరి రోజు 20.06.2025న ఆన్ లైన్ ధరఖాస్తులను సాయంత్రం 6 గంటల వరకు స్వీకరిస్తామన్నారు. గతంలో ఈఏపీఎమ్ సెట్ (EAPCET) ఫలితాల ఆధారంగా అభ్యర్ధుల ఎంపిక జరిగేదన్నారు. రాష్ట్రంలో 13,710 నర్సింగ్ సీట్లు ప్రభుత్వ, ప్రైవేటు కాలేజీల్లో ఉన్నాయన్నారు. ఇప్పటికే 5 వేలకు పైగా దరఖాస్తులు వచ్చాయని, మున్ముందు ఇవి 15000 వరకు పెరుగుతాయని ఆశిస్తున్నామన్నారు.
యూనివర్శిటీ రిజిస్ట్రార్ డాక్టర్ వి.రాధికారెడ్డి మాట్లాడుతూ ఇక్కడ నర్సింగ్ కోర్సు చేసి చాలామంది విదేశాల్లో ఉన్న డిమాండ్ దృష్ట్యా అక్కడ పనిచేయడానికి ముఖ్యంగా మిడిల్ ఈస్ట్ దేశాలకు, జర్మనీ దేశాలకు వెళ్లుతున్నారన్నారు. కంప్యూటర్ అలవాటు లేనివారికి వారం రోజుల పాటు మాక్ టెస్ట్స్ నిర్వహిస్తామన్నారు. మరిన్ని వివరాలకు విశ్వవిద్యాలయ వెబ్ సైట్ http://drntr.uhsap.in/ ను సంప్రదించి, ధరఖాస్తు చేయొచ్చు.

