కెనడాలో జరిగే G-7 శిఖరాగ్ర సమావేశాల్లో పాల్గొన్ననున్నప్రధాని నరేంద్ర మోడీ
అమరావతి: కెనడాలో ఈ నెలలో జరగనున్న 51వ G-7 శిఖరాగ్ర సమావేశానికి ప్రధాని నరేంద్ర మోడీ హాజరుకానున్నారు..ఈ విషయమై ప్రధాని మోదీ శుక్రవారం ఎక్స్ వేదికగా తెలిపారు..కెనడా ప్రధానమంత్రి మార్క్ కార్నే నుంచి కాల్ అందుకోవడం సంతోషంగా ఉందని ట్వీట్ చేశారు.. ఈ జూన్ 15 నుంచి 17 వరకు కెనడాలో జరగనున్న G-7 శిఖరాగ్ర సమావేశాల్లో పాల్గొంటారు.. కననాస్కిస్‌లో జరిగే G-7 శిఖరాగ్ర సమావేశానికి ఆహ్వానం పంపినందుకు కార్నేకు మోదీ ధన్యవాదాలు తెలిపారు..శక్తివంతమైన ప్రజాస్వామ్య దేశాలుగా భారత్-కెనడా ఎదుగుతున్నాయని,,పరస్పర గౌరవం,,సహకారం ద్వారా మార్గనిర్దేశం చేస్తూ నూతన శక్తితో కలిసి పనిచేస్తాయని వెల్లడించారు..శిఖరాగ్ర సమావేశంలో మా సమావేశం కోసం ఎదురు చూస్తున్నానని పేర్కొన్నారు..2019 నుంచి భారత ప్రధానిని ఫ్రాన్స్,,యూకే,,జర్మనీ,,జపాన్,,ఇటలీ దేశాలు G-7సదస్సులకు ఆహ్వానిస్తు వస్తూన్నాయి.

