కోవిడ్ J.N.1 వేరియంట్ పాత వైరస్, ప్రొఫెసర్ డాక్టర్ సంజయ్ రాయ్
అమరావతి: దేశవ్యాప్తంగా J.N.1 వేరియంట్ కేసులు వెలుగులోకి వస్తున్నాయని ఢిల్లీ ఎయిమ్స్ లో కమ్యూనిటీ మెడిసిన్ విభాగంలో ప్రొఫెసర్ డాక్టర్ సంజయ్ రాయ్ వెల్లడించారు..ఈ వైరస్ గురించి రకరకాల చర్చలు జరుగుతున్నాయి అయితే ఇది కోవిడ్ కొత్త వేరియంట్ కాదు..ఈ వేరియంట్ దాదాపు ఏడాదిన్నర క్రితం గుర్తించిన పాత వేరియంట్…ఇది ఓమిక్రాన్ సబ్ వేరియంట్…దీని గురించి భయపడాల్సిన అవసరం లేదు.. ప్రజలు జాగ్రత్తలు తీసుకోవడం ముఖ్యంమన్నారు.. ముఖ్యంగా రోగనిరోధక శక్తి బలహీనంగా ఉన్నవారు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు..ఎందుకంటే ఈ వ్యక్తులు వైరస్ బారిన పడే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని తెలిపారు..
కోవిడ్ J.N.1 వేరియంట్ లక్షణాలు:-J.N.1 వేరియంట్ అన్ని లక్షణాలు గతంలో లాగనే ఉన్నాయని,,దగ్గు, జలుబు, తలనొప్పి, తేలికపాటి జ్వరం లాంటి లక్షణాలు కనిపిస్తాయని డాక్టర్ సంజయ్ రాయ్ వివరించారు..బాధితుల్లో శ్వాసకోశ సమస్యలు కనిపించడం లేదని తెలిపారు..కరోనా వైరస్, ఎప్పటికీ పూర్తిగా పోదు అని డాక్టర్ రాయ్ పేర్కొన్నారు.. వైరస్ ఎప్పటికప్పుడు కనిపిస్తూనే ఉంటుందన్నారు.. వైరస్ తనను తాను సజీవంగా ఉంచుకోవడానికి పరివర్తన చెందుతూనే ఉంటుందన్నారు..ఈ క్రమంలో కొత్త రకాలైన వైరస్ లు వస్తూనే ఉంటాయన్నారు.. J.N.1 పాత వైరస్,,దాని లక్షణాలు కూడా తేలికపాటివన్నారు.. కోవిడ్ కేసులు పెరుగుతున్నప్పటికీ,, లక్షణాలలో గణనీయమైన తేడా లేదని డాక్టర్ వివరించారు.

