జూన్ 4 & 5 తేదీలలో జిల్లాలో పెన్షన్, జి పి ఎఫ్ కేసుల అదాలత్
నెల్లూరు: పెండింగ్‌లో ఉన్న పెన్షన్ కేసులు, జి పి ఎఫ్ కేసులను సమీక్షించి పరిష్కరించడానికి జూన్ 4, 5 తేదీలలో నెల్లూరు, వింజమూరులో పెన్షన్ & G.P.F అదాలత్ నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ ఆనంద్ తెలిపారు. పెన్షనర్లు & G.P.F చందాదారులకు సేవలను సకాలంలో సమర్థవంతంగా అందించడం కోసం జిల్లాలోని DDOలకు విజయవాడ ప్రిన్సిపల్ అకౌంటెంట్ జనరల్ కార్యాలయం వారు అవగాహన కల్పిస్తారని తెలిపారు. పెండింగ్‌లో ఉన్న పెన్షన్ కేసులు, G.P.F కేసులను సమీక్షించి పరిష్కరించడానికి, జూన్ 4న నెల్లూరులో,5వ తేదిన వింజమూరులో పెన్షన్ అదాలత్ నిర్వహిస్తారన్నారు. ఇందుకు గాను జిల్లా ట్రెజరీ అధికారిని నోడల్ అధికారిగా నియమిస్తున్నట్లు వివరించారు. పెండింగ్‌లో ఉన్న పెన్షన్ కేసులు/జి పి ఎఫ్ కేసులను పరిష్కరం పొందేందుకు పెన్షనర్లు & జి పి ఎఫ్ చందాదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. జిల్లా లోని అన్ని శాఖల DDOలు వారి సిబ్బందికి తెలియపరచాలని కోరారు.