AP&TGPOLITICS

జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడదల చేసిన ఎస్.ఈ.సీ

మైదుకూరులో మున్సిపల్‌ ఎన్నికలు వాయిదా..

అమరావతిం రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు నోటిఫికేషన్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునీత సోమవారం ఉదయం విడుదల చేశారు. ఈ సందర్భంగా విజయవాడలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, రాష్ట్ర వ్యాప్తంగా 28 జిల్లా పరిషత్‌లు, 659 ZPTC, 659 MPTC, 9,829 MPP స్థానాలకు ఎన్నికలు జరుగుతాయన్నారు. మొత్తం 2,81,34, 518 ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారని తెలిపారు. ఈ ఎన్నికలకు సంబంధించి అక్టోబర్ 21వ తేది నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానున్నదని, నవంబర్ 3వ తేదిన పోలింగ్ జరుగుతుందని చెప్పారు.

అక్టోబర్ 21న రిటర్నింగ్ అధికారులు ఎన్నికల ప్రకటనలు జారీ చేస్తారని, అదే రోజు నుంచి అక్టోబర్ 23వ తేది వరకు అభ్యర్థుల నుంచి నామినేషన్లు స్వీకరించడం జరుగుతుందన్నారు.నామినేషన్ ఫారమ్స్ పరిశీలన అక్టోబర్ 24వ తేదిన జరుగుతుంది. తిరస్కరణకు గురైన నామినేషన్లపై అక్టోబర్ 25వ తేదిన అప్పీళ్లు దాఖలు చేసుకునేందుకు అవకాశం ఉంటుందని,సదరు అప్పీళ్లను అక్టోబర్ 26వ తేదిన పరిష్కరించడం జరుగుతుందని తెలిపారు. అక్టోబర్ 27వ తేదిన నామినేషన్ల ఉపసంహరణకు చివరి గడువుగా ప్రకటించారు. ఉపసంహరణ ప్రక్రియ పూర్తయిన అనంతరం అదేరోజు బరిలో నిలిచే అభ్యర్థుల తుది జాబితాను ప్రకటిస్తారన్నారు.నవంబర్ 3వ తేదిన ZPTC,MPTC స్థానాలకు పోలింగ్ జరుగుతుంది. అవసరమైన ప్రాంతాల్లో నవంబర్ 4వ తేదిన రీపోలింగ్ నిర్వహిస్తారు. నవంబర్ 5వ తేదిన ఓట్ల లెక్కింపు.. అదే రోజు ఫలితాలను ప్రకటించనున్నారు.

మైదుకూరులో మున్సిపల్‌ ఎన్నికలు వాయిదా:- కడప జిల్లా మైదుకూరులో మున్సిపల్ ఎన్నికలను వాయిదా వేస్తున్నట్లు ఎస్ఈసీ అనిల్ చంద్ర పునేఠా ప్రకటించారు. నామినేషన్ పత్రాలను చింపివేసినందున వాటి పరిశీలన కష్టమని,ఈ నేపథ్యంలో అక్కడ మున్సిపల్ ఎన్నికలను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. జిల్లా కలెక్టర్ నివేదిక మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ స్పష్టం చేశారు. అక్కడ ఎన్నికల ప్రక్రియకు మళ్లీ నోటిఫికేషన్ ఇస్తామని తెలిపారు.

Nation First

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *