NATIONALOTHERSWORLD

దిశను మార్చుకుంటు దాడి చేసే “డ్యాన్సింగ్‌” మిస్సైల్‌ను ప్రయోగించిన ఇరాన్

అమరావతి: ఇరాన్‌-ఇజ్రాయెల్‌,,అమెరికా దాడులకు ప్రతిగా దాడులు సాగిస్తోంది. అమెరికాకు గల్ఫ్‌ దేశాలలో వున్న స్థావరాలు,,ఆస్తులే లక్ష్యంగా ఇరాన్‌ ప్రతిదాడులు కొనసాగిస్తోంది. బహ్రెయిన్,,సౌదీ అరేబియా,,యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ దేశాలపైకి భారీగా క్షిపణులు,,డ్రోన్‌లతో విధ్వసం సృష్టిస్తొంది. అటు ఇజ్రాయెల్ ఇటు అమెరికా స్థావరాలే లక్ష్యంగా చేసిన ప్రతిదాడుల్లో ఇరాన్‌ తొలిసారిగా అధునాతన క్షిపణు అయిన డ్యాన్సింగ్‌ మిస్సైల్‌గా పిలువబడే “సెజ్జిల్‌-2” (“అషౌరా”) ని ప్రయోగించింది. ఈ విషయాన్ని అంతర్జాతీయ మీడియా వర్గాలు పేర్కొన్నాయి. ఇరాన్‌ స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన ఈ క్షిపణి, సుదూరప్రాంతాల్లోని లక్ష్యాలను ఇది సమర్థంగా ధ్వంసం చేయగలదు.

దిశను మార్చుకుంటు దాడి:- ఇరాన్‌ స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన ఈ డ్యాన్సింగ్‌ మిసైల్ 700 కిలోల వార్‌ హెడ్‌లను 2,000 కిలోమీటర్లకు పైనే మోసుకెళ్లగల సామర్థ్యం ఉంటుంది. అత్యధిక ఎత్తులో కూడా సమర్థంగా దిశను మార్చుకుంటూ లక్ష్యాన్ని ఢీకొడుతుంది. అందుకే దీన్ని డ్యాన్సింగ్‌ మిసైల్‌ అని పిలుస్తారు. ఇది రెండు దశల, ఘన-ఇంధన బాలిస్టిక్ క్షిపణి. ఇది మాక్ 13 (గంటకు దాదాపు 17,000 కిలోమీటర్లు) కంటే ఎక్కువ వేగాన్ని చేరుకోగలదు.

ఇజ్రాయిల్ యారో,,ఐరన్‌ డోమ్‌ వంటి క్షిపణి రక్షణ వ్యవస్థలను తప్పించుకునేలా ఈ క్షిపణిని ఇరాన్ రూపొందించింది. ఇరాన్‌ ఈ క్షిపణుల డిజైన్ ను 1990లో ప్రారంభించి,తొలిసారిగా 2008లో పరీక్షించారు. ఆ సమయంలో ఈ క్షిపణి దాదాపు 800 కిలోమీటర్లు ప్రయాణించినట్లు తెలుస్తోంది. దినికి మెరుగైన నావిగేషన్ వ్యవస్థను అమర్చి 2009లో రెండోసారి ఈ మిస్సైల్‌ను పరీక్షించారు. ఆరోసారి ప్రయోగం చేసే సమయంలో ఈ క్షిపణి హిందూ మహాసముద్రంలోకి దాదాపు 1,900 కిలోమీటర్లు ప్రయాణించినట్లు సమాచారం. సెంటర్ ఫర్ స్ట్రాటజిక్ అండ్ ఇంటర్నేషనల్ స్టడీస్ (CSIS) వివరాల మేరకు ఈ క్షిపణి దాదాపు 18 మీటర్ల పొడవు,, 1.25 మీటర్ల చుట్టు కొలత ఉంటుంది. దీని బరువు 23,600 కిలోగ్రాములు వుంటుందని పేర్కొంది.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *