NATIONALOTHERSWORLD

ఇరాన్‌తో కాల్పుల విరమణను ఒప్పందంను పొడిగిస్తున్నాం-డోనాల్డ్ ట్రంప్

హోర్ముజ్ జలసంధిలో రెండు నౌకలపై కాల్పులు.UK..

అమరావతి: ఇరాన్‌తో చర్చలు కొనసాగేందుకు ఇరుదేశాల మధ్య గతంలో కుదిరిన కాల్పుల విరమణను ఒప్పందంను పొడిగిస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ఇరాన్ నాయకత్వం ఒక సమగ్ర ప్రతిపాదనను సమర్పించే వరకు ఈ కాల్పుల విరమణ కొనసాగుతుందని తెలిపారు.(ఎప్పటి వరకు అనే విషయం ప్రస్తావించలేదు) ఈ విషయంపై తన ట్రూత్ సోషల్ ఖాతా ద్వారా వివరాలను వెల్లడించారు. అమెరికా-ఇరాన్ మధ్య ఈ ఏప్రిల్ 8వ తేదీన కాల్పుల విరమణ ఒప్పందం రెండు వారాల పాటు కుదిరింది. కాల్పుల విరమణ ఒప్పందం మరో కొద్ది గంటల్లో ముగుస్తున్న సమయంలో ట్రంప్ ఈ నిర్ణయం తీసుకున్నారు. పాకిస్థాన్ ఫీల్డ్ మార్షల్ ఆసిమ్ మునీర్, ప్రధాని షెహబాజ్ షరీఫ్‌ల అభ్యర్థన మేరకు సైనిక చర్యను వాయిదా వేసి, దౌత్య చర్చలకు అవకాశం ఇవ్వాలని నిర్ణయించినట్లుగా పేర్కొన్నారు.  సీజ్ ఫైర్ కొనసాగుతున్న సమయంలోనే ఇరాన్‌పై సముద్ర దిగ్భంధనాన్ని (Blockade) కొనసాగించాలని సైన్యానికి ఆదేశాలు ఇచ్చినట్లుగా ట్రంప్ స్పష్టం చేశారు.“ఇరాన్ ప్రభుత్వంలో అంతర్గత విభేదాలు తీవ్రంగా ఉన్నాయి. అలాంటి పరిస్థితుల్లో వారు ఏకీకృత ప్రతిపాదనతో రావడానికి సమయం అవసరం. అందుకే ఈ దాడిని నిలిపివేసి, విరమణ ఒప్పందం పొడిగించాం” అని పేర్కొన్నారు.సముద్ర దిగ్భంధనం అంటే యుద్ధ చర్యే: ఇరాన్

వాణిజ్య నౌకలను లడ్డుకొవడం అంటే:- బ్లాకేడ్ కొనసాగించాలని ట్రంప్ తీసుకున్న నిర్ణయంపై ఇరాన్ మండిపడింది. ఇది కాల్పుల విరమణకు వ్యతిరేకమని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అర్ఘాచీ విమర్శించారు. వాణిజ్య నౌకలను లక్ష్యంగా చేసుకోవడమంటే యుద్ధ చర్యతో సమానమన్నారు. తమ ప్రయోజనాలను రక్షించుకోవడం ఇరాన్‌కు తెలుసని స్పష్టం చేశారు.పాకిస్తాన్ లో జరగాల్సిన చర్చలకు హాజరుకాకూడదని ఇరాన్ నిర్ణయించుకున్నట్లుగా టస్నీమ్ వార్త సంస్థ వెల్లడించింది. అమెరికా అతిగా డిమాండ్లు చేస్తుందని, అవి ఒప్పందానికి అడ్డుగా మారుతున్నాయి కాబట్టి చర్చల్లో పాల్గొనడం వ్యర్థమని అభిప్రాయపడుతున్నట్లుగా వెల్లడించింది.

హోర్ముజ్ జలసంధిలో రెండు నౌకలపై కాల్పులు.UK:-  హోర్ముజ్ జలసంధిలో రెండు నౌకలపై కాల్పులు జరిగాయని యూకే మారిటైమ్ ట్రేడ్ ఆపరేషన్స్ సెంటర్ (UKMTO) తెలిపింది.  ఇరాన్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC) ఒక కంటైనర్ షిప్‌పై కాల్పులు జరిపిందని, అదే సమయంలో మరో నౌకపై కూడా దాడి జరిగిందని UKMTO తెలిపింది. ఇరు దేశాల మధ్య చర్చలు పురోగమించే వరకు ఇరాన్‌తో కాల్పుల విరమణను పొడిగిస్తానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చెప్పిన తర్వాత ఈ పరిణామం చోటుచేసుకుంది, అదే సమయంలో ఇరాన్ ఓడరేవులపై అమెరికా దిగ్బంధనం కొనసాగుతోంది.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *