భారతదేశంలో తయారైన ఉత్పత్తులను ఉపయోగించాలి-ప్రధాని మోదీ
దేశప్రజలకు విజ్ఞప్తి..
అమరావతి:“ఆత్మనిర్భర్ భారత్”లో బాగంగా దేశంలో వినాయకచవితి,,దీపావళితో సహా పండగ ఏదైనా సరే భారతదేశంలో తయారైన ఉత్పత్తులను ఉపయోగించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశప్రజలకు విజ్ఞప్తి చేశారు.. రైల్వేలతో సహా రాష్ట్ర ప్రభుత్వంలోని వివిధ విభాగాలకు చెందిన పలు ప్రాజెక్టులను ప్రధాని మోదీ ప్రారంభించి,, శంకుస్థాపనలు చేశారు..సోమవారం గుజరాత్‌లోని దాహోద్‌లో లోకో మాన్యుఫ్యాక్చరింగ్ షాప్-రోలింగ్ స్టాక్ వర్క్ షాప్‌ను ప్రారంభించారు.. ఈ ఉత్పత్తి కేంద్రం నుంచి తయారు చేయబడిన మొదటి ఎలక్ట్రిక్ లోకోమోటివ్‌ను జెండా ఊపి ప్రారంభించారు..భారతదేశ ప్రజలు ఆదాయం సంపాదించి ముందుకు సాగాలంటే, ప్రతి భారతీయుడూ ఇక్కడి వస్తువులే వినియోగిస్తామని ప్రతిజ్ఞ చేయాలన్నారు..మన దేశంలో తయారైన ఉత్పత్తులు ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు పొందుతున్న సమయంలో మనం దేశీయ ఉత్పత్తులను మనం ఎందుకు ఉపయోగించకూడదని ప్రశ్నించారు..

రైల్వే రంగంలో కొత్త చరిత్ర:- దాహోద్ ప్లాంట్‌లో 9,000 హార్స్ పవర్ (HP) విద్యుత్ లోకోమోటివ్స్ తయారు చేస్తారు.. ఇవి 4,500 టన్నుల బరువును 120 కిలోమీటర్ల వేగంతో తీసుకెళ్లగల సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి..ఈ ప్లాంట్‌లో తయారు చేయబడిన లోకోమోటివ్స్ భారతదేశంలోనే అత్యంత శక్తివంతమైనవి కానున్నాయి..ఈ వర్క్ షాప్ వార్షిక ఉత్పత్తి సామర్థ్యం 120 ఎలక్ట్రిక్ లోకోమోటివ్‌లతో రూపొందిస్తారు.. భవిష్యత్ అవసరాల ఆధారంగా వీటిని 150 యూనిట్లకు పెంచవచ్చు..ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్య (PPP) నమూనా కింద, భారతీయ రైల్వేలు వచ్చే దశాబ్దంలో ఇదే విధమైన సౌకర్యాలతో 1,200 ఎలక్ట్రిక్ లోకోమోటివ్‌లను తయారు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది..ఈ లోకోమోటివ్స్ ఇంజిన్లు విదేశాలకు ఎగుమతి చేసే లక్ష్యంతో తయారు చేయనున్నారు..ఇది “మేక్ ఫర్ వరల్డ్” కార్యక్రమానికి తోడ్పాటునివ్వనుంది..
యువతకు ఉద్యోగాల కల్పన:- ఈ లోకోమోటివ్స్ రెజెనరేటివ్ బ్రేకింగ్ టెక్నాలజీతో రూపొందించబడ్డాయి..ఇవి శక్తి వినియోగాన్ని తగ్గించి పర్యావరణానికి అనుకూలంగా ఉంటాయి..అలాగే, డిజిటల్ ట్రాకింగ్ సిస్టమ్ (కవచ్) వంటి ఆధునిక సాంకేతికతలు ఈ లోకోమోటివ్స్ లో అమర్చబడ్డాయి..ఇవి రైల్వే భద్రతను మరింత పెంచుతాయి..ఈ ప్లాంట్ ప్రారంభం కావడంతో, దాహోద్ ప్రాంతంలో దాదాపు 10,000 కొత్త ఉద్యోగాలు సృష్టించబడతాయి.. అందులో 3,500 ప్రత్యక్ష,, 7,000 పరోక్ష ఉద్యోగాలు ఉంటాయి..ఈ కార్యక్రమంలో కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్, గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ సహా తదితరులు పాల్గొన్నారు.

