ఇంద్రాయణి నదిపై బ్రిడ్జి కూలి ఇద్దరు మృతి-32 మందికి గాయాలు
అమరావతి: మహారాష్ట్రలోని పుణెలో కుండమల ప్రాంతంలోని ఇంద్రాయణి నదిపై వున్న వంతెన కుప్పకూలింది..ఈ సంఘటనలో ఇద్దరు పర్యాటకులు మృతి చెందగా, 32 మంది టూరిస్టులు గాయపడ్డారు..వీరిలో ఆరుగురి పరిస్థితి విషమంగా వుంది.. సమాచారం తెలిసిన వెంటనే NDRF బృందాలు రంగంలోకి దిగి గాలింపు చర్యలు చేపట్టారు..కుండమల ప్రసిద్ధ పర్యాటక కేంద్రం,,వర్షాకాలంలో టూరిస్టులు ఎక్కువగా ఇక్కడికి వస్తుంటారు..ఆదివారం కావడంతో ఈ టూరిస్ట్ స్పాట్ కి పర్యాటకులు భారీగా తరలివచ్చారు.. ఇంద్రాయణి నదిపై నిర్మించిన ఈ వంతెన దశాబ్ద కాలం నాటిది..ఆదివారం కావడంతో పర్యాటకులు కుండమలకు పోటెత్తారు..పాత వంతెన కావడం,,దినికి తోడు భారీ వర్షాలకు తడిచిపోవడం,,అదే సమయంలో వంతెన పైకి పెద్ద సంఖ్యలో పర్యాటకులు రావడంతో బ్రిడ్జి కూలినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు..గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో ఇంద్రాయణి నది నీటి ప్రవాహం కూడా పెరిగింది.. నదిలో నీటి ప్రవాహం ఎక్కువగా ఉన్నా పర్యాటకుల భద్రత కోసం అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోలేదని తెలుస్తోంది.. నీటి ప్రవాహం వల్ల గల్లంతైన వారి కోసం చేపట్టిన సహాయక చర్యలు నెమ్మదించాయి.