VRHSలో అడ్మిషన్ల ప్రక్రియను ప్రారంభించిన మంత్రి నారాయణ
ఈనెల 23వ తేది నుంచి లాంఛనంగా..
నెల్లూరు: నర్సరీ నుంచి Intermediate తరగతి వరకు నిరుపేద బిడ్డలకు కార్పొరేట్ స్థాయి విద్యతో పాటు ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం భోజనం, సాయంత్రం స్నాక్స్,,రవాణా సౌకర్యాలతో పూర్తి ఉచితంగా విద్యార్థులకు డిజిటల్ విద్యాబోధన VRHSలో జరుగుతుందని మునిసిపాల్ శాఖ మంత్రి నారాయణ అన్నారు..ఆదివారం VRHSలో చిన్నారుల మధ్య కేక్ కట్ చేసి పుట్టిన రోజు వేడుకలు జరుపుకున్నారు..అనంతరం అడ్మిషన్ల ప్రక్రియను ప్రారంభించారు..
ఈ సందర్బంలో మంత్రి మాట్లాడుతూ పేదల ఆనందం,,చిన్నారుల కేరింతలతో వి.ఆర్.పాఠశాల మళ్లీ కళకళలాడడం చాలా సంతృప్తిగా ఉందని,,ఇది మర్చిపోలేని రోజు అని మంత్రి నారాయణ అన్నారు..అన్ని రకాల క్రీడా పరికరాలతో క్రీడా మైదానం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు..వి.ఆర్.పాఠశాలను తిరిగి ప్రారంభించి ఎన్నికల సమయంలో నెల్లూరు ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నాను అని మంత్రి చెప్పారు.. 1000 మందికి పైగా విద్యార్థులకు ఈ విద్యా సంవత్సరం నుంచి అడ్మిషన్లు కల్పిస్తున్నామని,,ఈనెల 23వ తేది నుంచి లాంఛనంగా వి ఆర్ పాఠశాల ప్రారంభం అవుంతుందన్నారు..నెల్లూరు నగరంలోని 54 మున్సిపల్ పాఠశాలలను దాతల సహకారంతో ఇదే తరహాగా తీర్చిదిద్దుతామని తెలిపారు.