ప్రధాని మోదీ పిలుపుకు స్పందించి హీరో మోహన్ లాల్
అమరావతి: ఫిబ్రవరి 24, 2025న మన్ కీ బాత్ కార్యక్రమంలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశంలో నానాటికి పెరిగి పోతున్న ఊబకాయం సమస్యను ప్రస్తావించి,, దీన్ని ఎదుర్కోవడానికి తక్కువ నూనె వాడాలని ప్రజలను కోరారు.. ఈ సందర్భంగా,, మోహన్‌లాల్‌తో సహా 10 మంది ప్రముఖులను ఈ ఉద్యమంలో భాగం కావాల్సిందిగా నామినేట్ చేశారు..ప్రధాని మోదీ తనను నామినేట్ చేయడంపై మోహన్ లాల్ తాజాగా స్పందించారు..ఊబకాయం సమస్యపై పోరాటానికి నాయకత్వం వహిస్తున్నందుకు ప్రధాని నరేంద్ర మోదీకి ధన్యవాదాలు.. ఇలాంటి ఆలోచనలతోనే ఆరోగ్యకరమైన భారతదేశాన్ని రూపొందించగలం..అధిక నూనె వినియోగాన్ని తగ్గించడం వలన ఊబకాయం నుంచి బయటపడడంతో పాటు ఆరోగ్యవంతమైన జీవనశైలి దిశగా ఒక అడుగులు వేయవచ్చు..ఈ మిషన్‌లో చేతులు కలిపేందుకు నేనూ 10 మందిని నామినేట్ చేస్తున్నా..మెగాస్టార్ చిరంజీవితో పాటు సూపర్ స్టార్ రజనీకాంత్,, దుల్కర్ సల్మాన్,,ఉన్ని ముకుందన్,,దర్శకుడు ప్రియ దర్శన్,,టోవినో థామస్,,మేయర్ రవి,,మంజు వారియర్,,కళ్యాణి ప్రియదర్శన్‌లను మోహన్ లాల్ నామినేట్ చేశాడు.