NATIONALPOLITICS

పశ్చిమ బెంగాల్,అస్సాం,తమిళనాడు,కేరళ,పుదుచ్చేరిలకు ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన ఈసీఈ

4 రాష్ట్రాలు,1 కేంద్ర పాలిత ప్రాంతంకు…

న్యూఢిల్లీ: భారత ఎన్నికల సంఘం ఆదివారం 4 గంటలకు న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్ లో మీడియా సమావేశం నిర్వహించింది. ఈ సమావేశంలో అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు మరియు కేంద్ర పాలిత ప్రాంతం అయిన పుదుచ్చేరిలకు అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను చీప్ ఎలక్షన్ కమీషనర్ జ్ఞానేష్ కుమార్ ప్రకటించారు. ఇటీవల ఈ రాష్ట్రాల్లో ఎన్నికల నిర్వహణకు సంబంధించిన సన్నాహాలను ఎన్నికల కమిషన్ సమీక్షించింది. ఈ సమీక్షల్లో భద్రతా ఏర్పాట్లు, ఓటర్ల జాబితాలు,ఎన్నికల నిర్వహణపై అధికారులు పరిశీలించారు.

నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ గడువు ముగిసే తేదీలు:- పశ్చిమ బెంగాల్ – మే 7…తమిళనాడు – మే 10…అస్సాం – మే 20… కేరళ– మే 23లతో ముగుస్తాయి.

ఈ రాష్ట్రాలలో మొత్తం 824 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికల ప్రక్రియను ఎలక్షన్ కమీషన్ వెల్లడించింది. ఎన్నికల ప్రకటనతో పాటు వెంటనే ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. పశ్చిమ బెంగాల్‌లో రెండు దశల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి.

ఎన్నికల తేదిలు:-

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్:- మొత్తం నియోజకవర్గాలు: 234

గెజిట్ నోటిఫికేషన్ విడుదల తేదీ: 30 మార్చి

నామినేషన్ల దాఖలు చివరి తేదీ: 06 ఏప్రిల్

నామినేషన్ల పరిశీలన తేదీ: 07 ఏప్రిల్

నామినేషన్ల ఉపసంహరణ చివరి తేదీ: 09 ఏప్రిల్

పోలింగ్ తేదీ: 23 ఏప్రిల్

ఓట్ల లెక్కింపు తేదీ: 04 మే

ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే తుది తేదీ: 06 మే

పశ్చిమబెంగాల్ ఎన్నికల షెడ్యూల్:–

మొదటి దశ (152 అసెంబ్లీ నియోజకవర్గాలు)

గెజిట్ నోటిఫికేషన్ విడుదల: 30 మార్చి

నామినేషన్ల దాఖలు చివరి తేదీ: 06 ఏప్రిల్

నామినేషన్ల పరిశీలన: 07 ఏప్రిల్

నామినేషన్ల ఉపసంహరణ చివరి తేదీ: 09 ఏప్రిల్

పోలింగ్ తేదీ: 23 ఏప్రిల్

రెండో దశ (142 అసెంబ్లీ నియోజకవర్గాలు)

గెజిట్ నోటిఫికేషన్ విడుదల: 02 ఏప్రిల్

నామినేషన్ల దాఖలు చివరి తేదీ: 09 ఏప్రిల్

నామినేషన్ల పరిశీలన: 10 ఏప్రిల్

నామినేషన్ల ఉపసంహరణ చివరి తేదీ: 13 ఏప్రిల్

పోలింగ్ తేదీ: 29 ఏప్రిల్

ఓట్ల లెక్కింపు: 04 మే

ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే తుది తేదీ: 06 మే

కేరళ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్:- మొత్తం నియోజకవర్గాలు: 140

గెజిట్ నోటిఫికేషన్ విడుదల తేదీ: 16 మార్చి

నామినేషన్ల దాఖలు చివరి తేదీ: 23 మార్చి  

నామినేషన్ల పరిశీలన తేదీ: 24 మార్చి

నామినేషన్ల ఉపసంహరణ చివరి తేదీ: 26 మార్చి

పోలింగ్ తేదీ: 09 ఏప్రిల్

ఓట్ల లెక్కింపు తేదీ: 04 మే

ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే తుది తేదీ: 06 మే

అస్సాం అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్:- మొత్తం నియోజకవర్గాలు: 126

గెజిట్ నోటిఫికేషన్ విడుదల తేదీ: 16 మార్చి

నామినేషన్ల దాఖలు చివరి తేదీ: 23 మార్చి

నామినేషన్ల పరిశీలన తేదీ: 24 మార్చి

నామినేషన్ల ఉపసంహరణ చివరి తేదీ: 26 మార్చి

పోలింగ్ తేదీ: 09 ఏప్రిల్

ఓట్ల లెక్కింపు తేదీ: 04 మే

ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే తుది తేదీ: 06 మే

పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్:- మొత్తం నియోజకవర్గాలు: 30

గెజిట్ నోటిఫికేషన్ విడుదల తేదీ: 16 మార్చి

నామినేషన్ల దాఖలు చివరి తేదీ: 23 మార్చి

నామినేషన్ల పరిశీలన తేదీ: 24 మార్చి

నామినేషన్ల ఉపసంహరణ చివరి తేదీ: 26 మార్చి

పోలింగ్ తేదీ: 09 ఏప్రిల్

ఓట్ల లెక్కింపు తేదీ: 04 మే

ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే తుది తేదీ: 06 మే

ఎన్నికల సమయంలో ఓటర్ల భద్రత, కేంద్ర సాయుధ పోలీసు బలగాల (CAPF) వినియోగం వంటి అంశాలపై రాజకీయ పార్టీలతో కూడా ఈసీఐ చర్చలు జరిపింది. ఇకపై ఎన్నికల సమయంలో జిల్లాల్లో CAPF బలగాల కదలికలను జిల్లా కలెక్టర్లు కాకుండా, ఈసీఐ నియమించే పోలీస్ పరిశీలకులు నిర్ణయిస్తారు అనే కీలక మార్పును కూడా కమిషన్ అమలు చేయనుంది.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *