కేరళలో కమినిస్టుల కోటను బద్దలు కొడుతున్న బీజెపీ
అమరావతి: కేరళలోని తిరువనంతపురం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ జెండా విజకేతనం ఎగురవేసింది. తిరువనంతపురం మున్సిపల్ కార్పొరేషన్‌లోని 101 వార్డులలో భారతీయ జనతా పార్టీ (BJP) నేతృత్వంలోని నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (NDA) 50 వార్డులను గెలుచుకుని సరికొత్త చరిత్రను నెలకొల్సింది. పాలక లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్ (LDF), కాంగ్రెస్ నేతృత్వంలోని యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ (UDF) లకు దిమ్మతిరిగింది.. 101 వార్డులకు గాను 50 వార్డులను బీజేపీ,, 29 ఎల్‌డీఎఫ్,,19 యూడీఎఫ్ ల్లో గెలిచాయి.రెండు వార్డుల్లో ఇండిపెండెంట్లు గెలిచారు. తిరువనంతపురంలో బీజేపీ పుంజుకోవడంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పందించారు..
అట్టడుగు స్థాయిలో పనిచేసిన:- తిరువనంతపురం ప్రజలకు ధన్యవాదాలు. తిరువనంతపురం కార్పొరేషన్‌లో బిజెపి-ఎన్‌డిఎకు లభించిన ఆధిక్యత కేరళ రాజకీయాల్లో ఒక కీలక మలుపు. రాష్ట్ర అభివృద్ధి ఆకాంక్షలను మా బీజెపీ మాత్రమే తీర్చగలదని ప్రజలు నిర్ణయం తీసుకున్నట్లు కన్సిస్తొంది. నగరం అభివృద్ధికి, ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పించడానికి మా పార్టీ కృషి చేస్తుంది. తిరువనంతపురం కార్పొరేషన్‌లో అద్భుతమైన ఫలితాన్ని సాధించడంలో ప్రజల మధ్య పనిచేసిన కష్టపడి పనిచేసే బిజెపి కార్యకర్తలందరికీ నా కృతజ్ఞతలు. కేరళలోని అట్టడుగు స్థాయిలో పనిచేసిన తరతరాలుగా కార్యకర్తల కృషి. పోరాటాలను గుర్తుచేసుకునే రోజుగా ఈ రోజు వుంటుందని’ అంటూ ప్రధాని మోదీ పేర్కొన్నారు.

