ఒడిశాలో పోలీసుల ఎదుట లొంగిపోయిన 22 మంది మావోయిస్టులు
అమరావతి: ఒడిశాలోని మల్కాన్గిరి జిల్లాలో మంగళవారం 22 మంది మావోయిస్టులు పోలీసుల ఎదుట లొంగిపోయారు. వీరిపై రూ1.89 కోట్ల రివార్డు ఉందని పోలీసులు తెలిపారు. లొంగిపోయిన మావోయిస్టుల వివరాలను డీజీపీ వై బి. ఖురానియా వెల్లడిస్తారని పేర్కొన్నారు. ఇంత మంది లొంగిపోవడం.. ఈ సంవత్సరంలో ఇదే తొలిసారని అధికారులు తెలిపారు. కలాహండి, కంధమాల్, బలంగీర్, మల్కాన్గిరి, కోరాపుట్, నబరంగ్పూర్, నౌపడా, రాయగడ, బౌధ్ జిల్లాల్లో మావోయిస్టుల ప్రభావం అత్యధికంగా ఉంది. లొంగిపోయిన మావోయిస్టులంతా ఏసీఎం, డీసీఎంలే ఉన్నారని,,వీరిపైన రూ.5.5 లక్షల నుంచి రూ.27 లక్షల వరకు రివార్డులు ఉన్నాయన్నారు. రాష్ట్రంలో మావోయిస్టులు లొంగిపోతే.. పొరుగునున్న ఛత్తీస్గఢ్ ప్రభుత్వం అందిస్తున్న రివార్డు కంటే 10 శాతం అధికంగా నగదు అందిస్తామని ఒడిశాలోని మోహన్ దాస్ మాంజీ ప్రభుత్వం సోమవారం ప్రకటించిన ప్రక్క రోజే, 22 మంది మావోయిస్టులు లొంగిపోయారు. రాబోయే రోజుల్లో మరింత మంది మావోయిస్టులు ప్రభుత్వం ఎదుట లొంగిపోయే అవకాశాలు ఉన్నాయని ప్రభుత్వం భావిస్తోంది.

