DISTRICTS

ఆది,సోమవార్లలో జిల్లాలో భారీ వర్షాల హెచ్చరికలు

కలెక్టరేట్‌లో కంట్రోల్‌ రూం ఏర్పాటు..

నెల్లూరు: నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన దిత్వా తుఫాన్ వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని,, దీని ప్రభావంతో జిల్లాలో ఈ నెల 30, డిసెంబర్ 1వ తేది వరకు రెండు రోజుల పాటు ఒక మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది.

నైరుతి బంగాళాఖాతం ‘దిత్వా’ తుపాను ప్రస్తుతానికి కారైకాల్ కి 150 కి,మీ.,పుదుచ్చేరికి 250 కి.మీ, చెన్నైకి 350కి.మీ దూరంలో కేంద్రీకృతం అయిందన్నారు. గడిచిన 6 గంటల్లో 10కి.మీ వేగంతో కదిలిన తుపాన్ ఆదివారం  తెల్లవారుజామునకు తమిళనాడు, పుదుచ్చేరి, దక్షిణకోస్తాంధ్ర తీరాలకు చేరుకునే అవకాశం వుందన్నారు. దీని ప్రభావంతో శనివారం చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు అలాగే ప్రకాశం, నెల్లూరు, కడప, అన్నమయ్య జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం

కలెక్టరేట్‌లో కంట్రోలు రూం ఏర్పాటు:- భారీ వర్షాల దృష్ట్యా ప్రజలకు అత్యవసర సేవలు అందించేందుకు కలెక్టరేట్‌లో కంట్రోలు రూంను ఏర్పాటుచేసినట్లు జాయింట్ కలెక్టర్ మొగిలి వెంకటేశ్వర్లు శనివారం ప్రకటనలో తెలిపారు.వర్షాల వలన ఇబ్బందులు తలెత్తితే కంట్రోలు రూం నెంబర్లు: 0861- 2331261, 7995576699 నెంబర్లకు ఫోన్‌ చేసి సమాచారం ఇవ్వాలని ఆయన సూచించారు. కంట్రోలు రూంలో 24 గంటలు విధులు నిర్వహించేలా సిబ్బందికి ఉత్తర్వులు జారీ చేసినట్లు చెప్పారు.ఆర్డీవోలు తమ తమ కార్యాలయాల్లో కంట్రోలు రూములను ఏర్పాటు చేయాలని ఆదేశించారు.

Nation First

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *