మృతుల కుటుంబాలకు రూ.25 లక్షలు నష్టపరిహారం ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం
అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన చంద్రబాబు..
తిరుపతి: వైకుంఠ ఏకాదశి టోకెన్ల జారీ సందర్భంగా బుధవారం తిరుపతిలో జరిగిన తొక్కిసలాట సంఘటనలో పలువురు భక్తులు మరణించండం దురదృష్టకరం..ఈ తోపులాటలో ఆరుగురు భక్తులు మృతి చెందారు..అక్కడ జరిగిన తోపులాటలో 48 మంది అస్వస్థతకు గురయ్యారు.. గాయపడిన వారిని రుయా, స్విమ్స్ ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు.
అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన చంద్రబాబు:- తిరుపతి తొక్కిసలాట ప్రాంతాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పరిశీలించారు.. గురువారం రేణిగుంట ఎయిర్‌పోర్టు నుంచి తొక్కిసలాట జరిగిన ప్రాంతానికి చేరుకున్న చంద్రబాబు, బైరాగిపట్టెడలో తొక్కిసలాట జరిగిన ప్రాంతాన్ని పరిశీలించారు..ఈ సందర్బంలో ఆయన, కలెక్టర్, ఎస్పీ,టీటీడీ అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. డ్యూటీ కేటాయించిన పోలీసు అధికారికి ఎలాంటి జాగ్రత్తలు చెప్పారని ఆరా తీశారు. టికెట్లు పంపిణీ కేంద్రంలో తొక్కిసలాటల నియంత్రణకు ముందస్తుగా ఎలాంటి చర్యలు తీసుకున్నారని అధికారులను ప్రశ్నించారు. ఇంతమంది అధికార యంత్రాంగం ఉండి టికెట్ల పంపిణీ సవ్యంగా ఎందుకు చేయలేకపోయారు?.. ఆఫ్‌లైన్, ఆన్‌లైన్‌లో ఎన్ని టికెట్లు జారీ చేశారు. సంఘటనా స్థలానికి అంబులెన్స్ ఎన్ని గంటలకు వచ్చిందంటూ వరుసగా చంద్రబాబు అధికారులను ప్రశ్నించారు. భక్తుల రద్దీ పెరుగుతుంటే అధికారులు ఏం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
మంత్రులు, మృతిచెందిన వారి కుటుంబానికి రూ.25 లక్షలు:- గురువారం ఉదయం రాష్ట్ర హోంశాఖ మంత్రి అనిత, రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి జిల్లా ఇన్చార్జి మంత్రి అనగాని సత్య ప్రసాద్, రాష్ట్ర దేవదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, గృహ నిర్మాణ,,సమాచార శాఖ మంత్రి కొలుసు పార్థసారథి జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ లు రుయా ఆసుపత్రి మార్చురిలో ఉన్న మృతులను పరిశీలించి వారి కుటుంబాలను ఓదార్చివివరాలు తెలుసుకున్నారు. వైకుంఠ ఏకాదశి దర్శనం టికెట్లు జారీ చేసే ప్రతి చోట సి సి కెమెరాలు ఉన్నాయని వాటిని పరిశీలించి ఈ సంఘటనపై పూర్తి విచారణ చేసిన తర్వాత సిబ్బంది నిర్లక్ష్యం ఉంటే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.. మృతిచెందిన వారి కుటుంబానికి రూ.25 లక్షలు అందజేయడం జరుగుతుందన్నారు. మృతి చెందిన వారి కుటుంబాలను ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని, మృతులు తమిళనాడు, ఆంధ్ర రాష్ట్రాలకు చెందిన వారని, వారి మృతదేహాలను ప్రత్యేక వాహనం ద్వారా ఒక అధికారిని పంపించి వారి స్వగ్రామాలకు చేర్చడం జరుగుతుందన్నారు.