కడపజిల్లాలో 40.1°C ఉష్ణోగ్రత నమోదు-వాతావరణశాఖ
అమరావతి: రాష్ట్రంలో ఎండల తీవ్రత కమ్రేపీ పెరుగుతొంది. మార్చిలోనే రాబోయే రోజుల్లో ఎండలు ఏ స్థాయిలో వుంటాయో వేరే చెప్పనక్కర్లలేదు..ఈ నేపథ్యంలో శుక్రవారం నంద్యాల జిల్లా చాగలమర్రిలో40.6°C, అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో 40.2°C, వైఎస్సార్ జిల్లా వేంపల్లిలో 40.1°C అధిక ఉష్ణోగ్రతలు నమోదైనట్లు విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రోణంకి కూర్మనాథ్ వెల్లడించారు. అలాగే 33 మండలాల్లో వడగాల్పులు వీచాయని అన్నారు. ఎండదెబ్బ తగలకుండా టోపీ, గొడుగు, టవల్, కాటన్ దుస్తులు ఉపయోగించాలని సూచించారు. పార్వతీపురంమన్యం సీతంపేట మండలాల్లో తీవ్ర వడగాల్పులు,82 మండలాల్లో వడగాల్పులు ప్రభావం చూపే అవకాశం ఉన్నట్లు తెలిపారు.