ఓటర్లకు సంబంధించి స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్-2026-డీఆర్వో
నెల్లూరు: భారత ఎన్నికల సంఘం (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్) SIR-2026 కార్యక్రమాన్ని చేపట్టనున్న నేపథ్యంలో మంగళవారం కలెక్టర్ కార్యాలయంలో అన్ని పొలిటికల్ పార్టీ ప్రతినిధులతో జిల్లా రెవిన్యూ అధికారి ఎన్.విజయకుమార్ అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్పెషల్ ఇంటెన్స్ రివిజన్ గతంలో 21 సంవత్సరాల క్రితం అంటే 2002లో జరిగిందని,,మళ్లీ 2026 చేపట్టడం జరిగుతుందన్నారు. పోలింగ్ స్టేషన్లో 1200 మంది ఓటర్లు ఉండే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని,,అదేవిధంగా (BLO) బూత్ లెవెల్ ఆఫీసర్లను నియమించడం జరుగుతుందన్నారు. సంబంధిత అధికారులు ఇంటింటికి సర్వే చేసి వివరాలు అందించడం జరుగుతుందని,,తదుపరి రాజకీయ పార్టీల ప్రతినిధులకు వివరాలు తెలియ చేయడం జరుగుతుందన్నారు. ఈ సందర్భంగా రాజకీయ పార్టీ ప్రతినిధులు లేవనెత్తనపల్లి అంశాలపై స్పందిస్తూ వారి సూచనలను పరిగణలోకి తీసుకోవడం జరుగుతుందని,,ఓటర్ల లిస్టులో డోర్ నెంబర్లు ఉండేలా చూడాలని పార్టీ ప్రతినిధులు కోరడం జరిగింది అని తెలిపారు. తదనుగుణంగా చర్యలు చేపట్టడం జరుగుతుందన్నారు. ఈ సందర్భంగా పలు ఫార్మ్ లను వాటి ఆవశ్యకతను అందరికీ వివరించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ కార్యాలయ ఎలక్షన్ సూపరింటెండెంట్ ఆష ర్, బిజెపి పార్టీ నుంచి రాజేష్, శ్రీనివాసులు, బీఎస్పీ పార్టీ నుంచి శ్రీరామ్, సిపిఎం పార్టీ నుంచి మాదాల వెంకటేశ్వర్లు మరియు దయాకర్, కాంగ్రెస్ పార్టీ నుంచి సంజయ్ కుమార్, సుధాకర్ తెలుగుదేశం పార్టీ నుంచి రసూల్, వైయస్సార్సీపి పార్టీ నుంచి శేషయ్య తదితరులు హాజరయ్యారు…

