రెడ్‌క్రాస్,మా వద్ద ఆధారాల మేరకు ఫిర్యాదులున్నవారికి నోటీసులు జారీ చేస్తాం-కలెక్టర్
నెల్లూరు: రెడ్‌క్రాస్ మేనేజింగ్ కమిటీ సభ్యులు IRCS నిబంధనల ప్రకారం పని చెయ్యాలని జిల్లా కలెక్టర్ & మేనేజింగ్ కమిటీ ప్రెసిడెంట్ ఒ.ఆనంద్ సభ్యులకు సూచించారు. బుధవారం కలెక్టర్ చాంబర్‌లో రెడ్‌క్రాస్ మేనేజింగ్ కమిటీ సభ్యులతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు. మేనేజింగ్ కమిటీ సభ్యులు తటస్థంగా, నిష్పక్షపాతంగా వ్యవహరించాలన్నారు.అలా కాకుండా కొంత మంది రాజకీయ పార్టీల కార్యక్రమాల్లో పాల్గొంటూ నిబంధనలను ఉల్లంఘిస్తున్నట్లు స్టేట్ కమిటీ నుంచి లేఖలు వచ్చాయన్నారు.కనుక నిబంధనలు ఉల్లంఘించ వద్దని కోరారు. రెడ్‌క్రాస్ సొసైటీలో ఉన్నంతవరకు ఏ రాజకీయ పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనవద్దని చెప్పారు. ఇప్పటికే కొంతమంది సభ్యులపై ఆధారాలతో ఫిర్యాదులు అందాయన్నారు. వారందరూ మేనేజింగ్ కమిటీ నుండి స్వచ్ఛందంగా వైదొలగాలని సూచించారు. మిగిలిన సభ్యులు కూడా ఎలాంటి పార్టీ కార్యకలాపాల్లో పాల్గొన్న వద్దన్నారు. పార్టీలో ఉంటే సొసైటీ కార్యకలాపాలు సక్రమంగా నడపలేరన్నారు.మిగిలిన సభ్యులు ఒకరిని చైర్మన్ గా ఎంపిక చేసి కోవచ్చాన్నారు. కోరం లేకపోతే రద్దు చేసి మళ్లీ ఎన్నికలకు వెళ్లవలసి వస్తుందన్నారు. మా వద్ద ఆధారాల మేరకు ఫిర్యాదులున్న వారికి నోటీసులు జారీ చేస్తామని, వారు రాజకీయ పార్టీల కార్యక్రమాల్లో పాల్గొనకపోతే 24 గంటల్లోగా వివరణ ఇస్తే పరిశీలన చేస్తామన్నారు. ప్రజాప్రతినిధులను కలవడంలో ఎటువంటి అభ్యంతరం లేదన్నారు. ఎలాంటి కుల, మత, రాజకీయ పార్టీల ప్రమేయం లేకుండా ప్రజలకు సేవాకార్యక్రమాలు చేయడమే లక్ష్యంగా పనిచేయాలని సభ్యులకు సూచించారు. ఈ సమావేశంలో డిఆర్‌వో జె ఉదయభాస్కర్‌రావు, రెడ్‌క్రాస్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.