మౌలిక వసతుల కల్పనలో వాజ్‌పేయి వేసిన పథంలో నేడు దేశం అభివృద్ది వైపు-మంత్రి సత్యకుమార్
నెల్లూరు: భారతదేశ ప్రధాన మంత్రిగా ఆటల్ బీహారీ వాజ్‌పేయి, జాతీయ రహదారులు, గ్రామీణ ఉపాధి, టెలికాం–ఐటీ కనెక్టివిటీ, మెడికల్ సైన్స్ సంస్థలు, మెట్రో రవాణా వంటి రంగాల్లో అయన వేసిన పునాదులే నేడు ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో విస్తృత స్థాయిలో ఫలితాలుగా మారుతున్నాయని ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు. సోమవారం నెల్లూరులో నిర్వహించిన అటల్–మోదీ సుపరిపాలన యాత్ర బహిరంగ సభలో పాల్గొన్న అనంతరం ముత్తుకూరు రోడ్డు,హరనాథ్ పురం సెంటర వద్ద వాజ్‌పేయి విగ్రహాంను అవిష్కరించన సందర్బంలో మంత్రి సత్యకుమార్ మాట్లాడుతూ వాజ్‌పేయి దగ్గరగా చూసిన వ్యక్తిగా ఆయనలోని గొప్పతనం మాటల్లో కాకుండా ఆచరణలో కనిపించేదని మంత్రి సత్యకుమార్ చెప్పారు. దూరం నుంచి చూసే వారికి ఆయన సౌమ్యంగా కనిపించినా, దగ్గరకు వెళ్లినప్పుడు ప్రజల బాధను తన కవిత్వం, ప్రసంగాల ద్వారా వ్యక్తపరిచిన గొప్ప నాయకుడన్నారు. ఆటల్ బీహారీ వాజ్‌పేయి పార్లమెంటులో ప్రసంగిస్తూంటే, ఆయన ప్రసంగాలను దేశమంతా ఆసక్తిగా వినేదని,, పార్టీకి రెండు సీట్లు మాత్రమే వచ్చిన సందర్భాల్లోనూ నిరాశ చెందకుండా, కార్యకర్తలకు ధైర్యం ఇచ్చి కొత్త నాయకత్వాన్ని తయారు చేసిన దార్శనికుడని శ్లాఘించారు.వాజ్‌పేయి స్పూర్తితోనే మోదీ లక్షల కిలోమీటర్ల రహదారులు, కొత్త మెడికల్ సైన్స్ కేంద్రాలు, మౌలిక వసతుల విప్లవాన్ని ముందుకు తీసుకెళ్లుతున్నరన్నారు. వాజ్‌పేయి ఉదారవాదిగా పేరున్నప్పటికీ, దేశ భద్రత విషయంలో ఎక్కడా రాజీ పడలేదని తెలిపారు. కార్గిల్ యుద్ధం, అణు పరీక్షలు ఇందుకు స్పష్టమైన ఉదాహరణలని,, నేడు ప్రధాని మోదీ పాలనలో దేశ భద్రత మరింత బలోపేతమై, ఉగ్రవాదానికి గట్టి సమాధానం ఇస్తున్నామని వెల్లడించారు.విగ్రహా అవిష్కరణ కార్యక్రమంలో బీజెపీ రాష్ట్ర అధ్యక్షడు మాధవ్, దేవాదాయశాఖ మంత్రి ఆనం.రామనారాయణరెడ్డి,ఎం.పీలు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి,,బీదా.మస్తాన్ రావు,కోవూరు,సర్వేపల్లి,,కావలి ఎమ్మేల్యేలు వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి,,సోమిరెడ్డి.చంద్రమోహన్ రెడ్డి,,కావ్య క్రిష్ణారెడ్డి,,ఆర్డీసీ రీజనల్ ఛైర్మన్ సురేష్ రెడ్డి,బీజెపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సురేంద్రరెడ్డి,జిల్లా,నగర బీజెపీ నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.

