కార్పొరేషన్ నుంచి సిటీ సర్వేయర్,ఉద్యాన శాఖ అసిస్టెంట్ డైరెక్టర్,ఎగ్జామినర్ బదలీ
నెల్లూరు: నగరపాలక సంస్థలో పట్టణ ప్రణాళిక విభాగం సిటీ సర్వేయర్ గా విధులు నిర్వహిస్తూ బదిలీ అయిన సోమేశ్వరరావు, ఉద్యాన శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ గా విధులు నిర్వహిస్తూ బదిలీ అయిన ప్రదీప్ కుమార్, ఎగ్జామినర్ గా విధులు నిర్వహిస్తూ బదిలీ అయిన మహమ్మద్ రఫీలు కార్యాలయంలోని కమిషనర్ ఛాంబర్ లో శుక్రవారం కమిషనర్ వై.ఓ నందన్ ను మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు..ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ బదిలీపై వెళ్తున్న వారంతా నెల్లూరు నగర పాలక సంస్థ విధులలో ఉత్తమ ప్రతిభ కనబరిచారని, నూతనంగా చేరబోయే సంస్థలలో కూడా ఇదే విధమైన ప్రతిభను ప్రదర్శించాలని ఆకాంక్షించారు..నెల్లూరు నగరపాలక సంస్థ డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్, S.E రామ్మోహన్రావు, డిప్యూటీ డైరెక్టర్ మాధురీలు వారిని సాదరపూర్వకంగా సన్మానించారు.