ఆత్మకూరు బస్టాండ్ అండర్ బ్రిడ్జి నిర్దేశించిన సమయంలోపు-కమీషనర్
నెల్లూరు: నగరపాలక సంస్థ కమిషనర్ నందన్ స్థానిక ఆత్మకూరు బస్టాండ్ అండర్ బ్రిడ్జి ప్రాంతంలో జరుగుతున్న అభివృద్ధి పనులను బుధవారం అధికారులతో కలిసి పరిశీలించారు. అండర్ బ్రిడ్జి ప్రాంతంలో డ్రైను కాలువల పైప్ లైన్లు ఏర్పాటు, తదితర అంశాలను పరిశీలించి అధికారులకు వివిధ సూచనలు జారీ చేశారు. నిర్దేశించిన సమయంలోపు అండర్ బ్రిడ్జి నిర్మాణ పనులను పూర్తి చేసి వాహనాల రాకపోకలకు ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని కమిషనర్ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో నెల్లూరు నగరపాలక సంస్థ ఇంజనీరింగ్ విభాగం ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ రహంతు జానీ, టౌన్ ప్లానింగ్ విభాగం సిటీ ప్లానర్ హిమబిందు, స్థానిక ప్రజా ప్రతినిధులు,వార్డు సచివాలయ కార్యదర్శులు, సిబ్బంది పాల్గొన్నారు.

