DISTRICTS

నక్కలోళ్ళ సెంటర్ వద్ద దుకాణలు తొలగించిన కార్పరేషన్ సిబ్బంది

నెల్లూరు: నగరపాలక సంస్థ కమిషనర్ వై.ఓ నందన్ ఆదేశాల మేరకు స్థానిక హరనాథపురం ప్రాంతంలో పట్టణ ప్రణాళిక విభాగం అనుమతులు లేకుండా అనధికారికంగా నిర్మిస్తున్న భవనం పిల్లర్ల దశలో నిర్మాణాన్ని శుక్రవారం టౌన్ ప్లానింగ్ సిబ్బంది తొలగించారు. అలాగే స్థానిక సుబేదార్ పేట ప్రాంతంలోని నక్కలోళ్ళ సెంటర్ వద్ద ట్రాఫిక్ సమస్య పరిష్కారం కొసం రోడ్డు ఆక్రమణ దుకాణాలను మార్జిన్ లోపల ఏర్పాటు చేసుకునేలా చర్యలు తీసుకున్నారు. నగరపాలక సంస్థ టౌన్ ప్లానింగ్ విభాగ అనుమతులు లేకుండా ఎలాంటి నిర్మాణాలు చేపట్టరాదని, అనుమతులను అతిక్రమించి నిర్మాణాలు చేపడితే తప్పనిసరిగా తొలగిస్తామని కమిషనర్ ఈ సందర్భంగా హెచ్చరించారు.

Nation First

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *