మధ్యవర్తుల వ్యవస్థను తొలగించేలా అన్ని వ్యవస్థల్లో మార్పులు తీసుకురావాలి-రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము
అమరావతి: దేశంలో స్వయం సహాయ సంఘాలు ఏర్పాటు చేసిన తర్వాత మహిళల జీవితాల్లో గణనీయమైన మార్పు వచ్చిందని ఆర్థికంగా, పారిశ్రామికంగా ఎంతో ప్రగతి సాధించారని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము అభిప్రాయపడ్డారు. ప్రధాన మంత్రి లక్ పతీ దీదీ ఆకాంక్షను నెరవేర్చే దిశగానే కాకుండా కరోడ్ పతీదీదీగా మారేందుకు మహిళలు కృషి చేయాలని ఆకాక్షించారు. 2047 నాటికి దేశ అర్థిక అభివృద్ధికి తోడ్పడాలని పిలుపునిచ్చారు.గురువారం విజయవాడ పున్నమి ఘాట్ వద్ద నిర్వహిస్తున్న జాతీయ సరస్ మేళా–2026 ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న సందర్బంలో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ముఖ్య అతిథిగా హాజరు అయ్యి ప్రసంగించారు.దేశవ్యాప్తంగా NHG మహిళలు పాల్గొంటున్న సరస్ మేళా విజయవాడలో ఏర్పాటు చేసినందుకు కేంద్ర వ్యవసాయ గ్రామీణాభివృద్ధి మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, గవర్నర్ అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి చంద్రబాబును రాష్ట్రపతి ప్రత్యేకంగా అభినందించారు.
త్వరలోనే తెలుగు భాషను కూడా నేర్చుకుని:- దేవీ శరన్నవరాత్రుల వేళ, కనకదుర్గమ్మ సన్నిధిలో ఈ సరస్ మేళా ఏర్పాటు చేయటం అభినందనీయం అన్నారు. గ్రామీణ ప్రాంతాల్లోని మహిళలు ఆర్ధికంగా సాధికారిత సాధించేలా ప్రధాని మోదీ ప్రత్యేకంగా చర్యలు ఫలితంగా,SHG మహిళలు సాంకేతికంగా, ఆర్దిక అంశాల్లో పెద్ద ఎత్తున భాగస్వామ్యం వహిస్తున్నారని తెలిపారు. గ్రామీణ అజీవికా మిషన్ ద్వారా మహిళలు నేతృత్వం వహించే మరిన్ని సంస్థలు ప్రారంభం కావాలని కోరుకున్నట్లు తెలిపారు. గ్రామీణ అజీవికా మిషన్ ద్వారా మహిళలు నేతృత్వం వహించే మరిన్ని సంస్థలు ప్రారంభం కావాలని కోరుకున్నట్లు తెలిపారు. మధ్యవర్తుల వ్యవస్థను తొలగించేలా అన్ని వ్యవస్థలూ మార్పులు తీసుకురావాలని, గ్రామీణ ప్రాంతాల్లోని మహిళా రైతులు స్వయం సాధికారితను సాధించేలా తోడ్పాటు అందించాలని కోరారు. ఆంధ్రప్రదేశ్,ఒడిశా రాష్ట్రానికి పక్కనే ఉన్నప్పటికీ తెలుగు భాషలో నేను మాట్లాడలేకపోతున్నాను అని త్వరలోనే తెలుగు భాషను కూడా నేర్చుకుని మీతో మాట్లాడేందుకు వస్తానని హామీ ఇస్తున్నాను అని అన్నారు. దిల్లీ వెలుపల జాతీయ సరస్ మేళాను విజయవాడలో తొలిసారి ఏర్పాటు చేశారు.

