ఇక నుంచి మీకు గుర్తు తెలియని నెంబర్ల నుంచి కాల్స్ అనే సమస్యే ఉండదు
నవంబర్ 1 నుంచి కాలర్ పేరును ప్రదర్శించాలి..
అమరావతి: నవంబర్ 1వ తేది నుంచి వినియోగదారులకు ‘కాలర్ ఐడి’ (caller ID) తప్పనిసరి చేయాలని భారత ప్రభుత్వం,, టెలికాం సంస్థలకు ఆదేశాలు జారీ చేసింది. ఇకపై ఎవరైనా మీకు కాల్ చేసినప్పుడు, వారి ఫోన్ నంబర్‌తో పాటు వారి పేరు కూడా మీ ఫోన్ స్క్రీన్‌పై కనిపిస్తుంది.
కాలింగ్ నేమ్ ప్రెజెంటేషన్’:- ఇక నుంచి మీకు గుర్తు తెలియని నెంబర్ల నుంచి కాల్స్ అనే సమస్యే ఉండదు. కేంద్ర ప్రభుత్వం మొబైల్ వినియోగదారుల కోసం కాలర్ ఐడిని తప్పనిసరి చేసింది. ప్రతి 4జీ, 5జీ ఫోన్లలో కాలర్ ఐడీ డిస్ప్లే కావాల్సిందే. టెలికమ్యూనికేషన్స్ విభాగం (DoT), టెలికాం సేవా సంస్థలను (TSPs) 2026 నవంబర్ 1 నుండి ‘ (CNAP) సదుపాయాన్ని ప్రవేశపెట్టాలని ఆదేశించింది. CNAP అనేది భారతదేశానికి చెందిన కాలర్ గుర్తింపు వ్యవస్థ. ఇది కాల్ చేసేవారి నంబర్‌ను-పేరును డిస్ ప్లే చేస్తుంది.
ప్రస్తుతానికి 4జీ, 5జీ నెట్వర్క్ లకు మాత్రమే:- ఇదే సమయంలో యూజర్ల ప్రైవసీ, సెక్యూరిటీకి ప్రాధాన్యం ఇవ్వాలని డీవోటీ సూచించింది. సీఎల్ఐఆర్ ఫీచర్ ప్రకారం కొందరు కాలర్ల ఐడెంటినీ మాత్రం టెలికాం కంపెనీలు దాచే అవకాశం ఉంది. వారి పేర్లు మాత్రం భద్రతా కారణాల రీత్యా డిస్ప్లే కావు. ఒక సంస్థ తరఫున కాల్ చేసినా లేదా బల్క్ నెంబర్లు తీసుకుని కాల్స్ చేసినా ఒక స్పష్టమైన పేరును సదరు సంస్థలు ఎంచుకోవాలి. అప్పుడు, ఆ పేరే డిస్ప్లేలో కనిపిస్తుంది. ఈ సంస్థలు తమ ట్రేడ్ మార్క్ ను రిజిష్టర్ చేసుకోవాలి. అలాగే జీఎస్టీ గుర్తించిన వ్యాపార సంస్థ పేరు కలిగి ఉండాలి. ప్రస్తుతానికి 4జీ, 5జీ నెట్వర్క్ లకు మాత్రమే ఈ నిర్ణయం వర్తిస్తుంది. 2జీ, 3జీలకు కూడా అమలు చేసే అంశాన్ని పరిశీలిస్తోంది.

