ఉస్తాద్ భగత్‌సింగ్ కు ఎటువంటి సెన్సార్ కట్స్ లేకుండా యు\ఎ సర్టిఫికేట్
మార్చి 19న…
హైదరాబాద్: పవన్ కల్యాణ్ కథానాయకుడిగా నటిస్తున్న ఉస్తాద్ భగత్‌సింగ్ చిత్రం సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఈ నెల 19వ తేదిన ఉగాది కనుకగా ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ చిత్రం ఎటువంటి కట్స్ లేకుండా (U/A Certificate) పొందిందని మేకర్స్ తెలిపారు. గబ్బర్‌సింగ్ లాంటి బ్లాక్‌బస్టర్ తర్వాత పవన్, హరీశ్ శంకర్ కాంబినేషన్లో వస్తున్న భారీ చిత్రమిది. శ్రీలీల, రాశీఖన్నా కథానాయికలు. ఇందులో పవన్ IPS ఆఫీసర్ భగత్‌సింగ్‌గా కనిపించనున్నారు. ఇటీవల పవన్ డబ్బింగ్ కార్యక్రమాలు పూర్తి చేశారు. ఈ సినిమా నిడివి 2 గంటల 29 నిమిషాలనీ, సినిమాలో మాటలు థియేటర్ దద్దరిల్లిపోయేలా ఉన్నాయని సినిమా విశ్లేషకుల అంచనా.ఈ చిత్రానికి పాటలకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించగా, నేపథ్య సంగీతం తమన్ అందించడం విశేషం. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది

