యాంకర్ సుమ ప్రచారం చేయడం వల్లనే ప్లాట్స్ కొన్నాం,ఆవేదన వ్యక్తం చేస్తున్న బాధితులు
అమరావతి: టాలీవుడ్ ప్రముఖ యాంకర్ సుమ కనకాల వివాదంలో చిక్కుకున్నారు.. ఆమె ప్రచారం చేసిన రాకీ అవెన్యూస్ సంస్థ బోర్డు తిప్పేయడంతో బాధితులు రోడ్డెక్కి, తమకు న్యాయం చేయాలంటూ ఫ్లకార్డులు పట్టుకొని నిరసన తెలియజేశారు.. 3 సంవత్సరాల క్రితం ప్రముఖ కన్ స్ట్రక్షన్ కంపెనీ రాకీ ఎవెన్యూస్ ప్రైవేట్ లిమిటెడ్ ఆంధ్రప్రదేశ్ రాజమండ్రిలో “చంద్రిక అవంతిక ఫేస్ 2 “అనే వెంచర్ వేసింది.. ఈ సందర్భంగా డబుల్ బెడ్ రూమ్, త్రిబుల్ బెడ్ రూమ్ ఫ్లాట్‌లను కట్టి తక్కువ రేట్‌కే ఇస్తామని ప్రచారం పేర్కొంది..ఈ సంస్థలకు యాంకర్ సుమ బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తూ నమ్మకంతో కూడిన కంపెనీ అంటూ ప్రచారం చేసింది..
ఆ సంస్థను నమ్మిన ప్రజలు లక్షల్లో డబ్బులు చెల్లించి ప్లాట్లు బుక్ చేసుకున్నారు..ప్రజల నుంచి దాదాపు రూ.88 కోట్లు వసూలు చేసిన తరువాత ఇప్పుడు సంస్థ బోర్డు తిప్పేసింది.. మోసపోయామని తెలుసుకున్న బాధితులు చేసేదేమీ లేక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసి ప్లకార్డులతో రోడ్లపై నిరసన చేపట్టారు..తమకు న్యాయం చేయాలంటూ ప్రభుత్వాన్ని కోరుతున్నారు…వీరిలో కొంతమంది బాధితులు, కేవలం సుమ కనకాల ఆ సంస్థకు ప్రచారం చేయడం వల్ల ప్లాట్స్ కొన్నామని, ఇప్పుడు వాళ్ళు బోర్డు తిప్పేశారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.. సుమ కూడా తమకు న్యాయం జరిగేలా చూడాలని డిమాండ్ చేశారు..మోస పోయిన బాధితుల్లో కొంత మంది సుమ ప్రచారంపై కోర్టులో కేసు దాఖలు చేసినట్లు తెలిసింది..